Home > సినిమా > నవదీప్కు నోటీసులు.. ముహూర్తం ఫిక్స్..

నవదీప్కు నోటీసులు.. ముహూర్తం ఫిక్స్..

నవదీప్కు నోటీసులు.. ముహూర్తం ఫిక్స్..
X

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న నటుడు నవదీప్కు నార్కోటిక్స్ బ్యూరో నోటీసులు ఇచ్చింది. 41A కింద నోటీసులు ఇచ్చిన అధికారులు.. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశించారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను అధికారులు డ్రగ్‌ కన్జ్యూమర్‏గా గుర్తించారు. ఈ కేసులో అరెస్టైనా రాంచందర్ అనే వ్యక్తి తో నవదీప్ కు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌తో పాటు.. కాల్‌ డేటాను సేకరించారు. వీటి ఆధారంగా నవదీప్ను అధికారులు ప్రశ్నించనున్నారు.

బుధవారం నవదీప్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. నవదీప్‎కు బెయిల్ ఇవ్వొద్దన్న నార్కొటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. 41A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. విచారణకు హాజరుకావాలని నవదీప్‎కు కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ను పోలీసులు ఏ29గా చేర్చారు.


Updated : 21 Sept 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top