Madhapur Drugs Case : కాసేపట్లో నవదీప్ను ప్రశ్నించనున్న అధికారులు
X
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ను నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కాసేపట్లో విచారించనున్నారు. ఇవాళ ఉదయం 11గంటలకు తమ ముందు హాజరుకావాలని గతంలో అధికారులు ఆయనకు 41A కింద నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను అధికారులు డ్రగ్ కన్జ్యూమర్‌గా గుర్తించారు. ఇదే కేసులో అరెస్టైనా రాంచందర్ అనే వ్యక్తి తో నవదీప్కు సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్‌తో పాటు.. కాల్ డేటాను సేకరించారు. వీటి ఆధారంగా నవదీప్ను అధికారులు ప్రశ్నించనున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ను పోలీసులు ఏ29గా చేర్చారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ను కొట్టేసింది. నవదీప్కు బెయిల్ ఇవ్వొద్దన్న నార్కొటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. 41A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. దీంతో అధికారులు ఆయనకు ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.