ఓటీటీలో 'మళ్లీ పెళ్లి'..ఎప్పుడంటే
X
సోషల్ మీడియా సెన్సేషనల్ కపుల్ నరేష్, పవిత్ర లోకేష్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. జూన్ 23న తెలుగు ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు నరేష్. దీంతో మరోసారి నెట్టింట్లో వీరిద్దరి సందడి మొదలైంది.
సీనియర్ డైరెక్టర్ ఎం.ఎస్. రాజు డైరెక్షన్ వహించిన మళ్లీ పెళ్లి సినిమా మే 26న థియేటర్లలో తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా చేసి నరేష్ పవిత్రలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో వారి బంధం, పెళ్లి గురించి అనేక సంచలన వ్యాఖ్యలు చేసి ట్రోల్ కూడా అయ్యారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ఓటీటీ ఆహాలోనూ స్ట్రీమింగ్ కానుంది. అందకు ఈ నెల 23వ తేదీని ఫిక్స్ చేశారు.