నరేశ్ మూడో భార్యకు కోర్టు షాక్.. ‘మళ్లీ పెళ్లి’లోనూ, ఇంటి కేసులో దెబ్బ
X
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ (Naresh)కు కోర్టులో రెండు కేసుల్లో ఊరట దక్కింది. నరేశ్, ఆయన కాబోయే నాలుగో భార్య పవిత్రా నరేశ్ కలసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) సినిమాకు ఆటకాంలు తొలగిపోయాయి. ఈ చిత్రాన్నివిడుదల చేయకూడదని నరేశ్ మూడో భార్య రఘుపతి (Ramya Raghupathi) వేసిన పిటిషన్‌ను బెంగళూరు సివిల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. కల్పిత కథ అని సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన చిత్రాలను అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంలో లోటుపాట్లు ఉంటే చర్య తీసుకోవచ్చు. కానీ ఒక చిత్రాన్ని పూర్తిగా ఫిక్షన్ అని చెప్పాక ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకోవడానికి అవకాశం ఇవ్వలేం’’ అని తెలిపింది. నరేశ్ తన పెళ్లిళ్ల గురించి, పవిత్రతో సంబంధాల గురించి ‘మళ్లీపెళ్లి’లో బోల్డ్‌గా చూపించారు. అందులో తనను గయ్యాళిగంపలా, చెడు వ్యక్తిగా చూపించారని రమ్య మండిపడుతున్నారు.
మరో కేసు..
కాగా రమ్య రఘుపతి తమ ఇంట్లోకి చొరబడకుండా ఆదేశాలు ఇవ్వాలని నరేశ్ కుటుంబం చేసిన అభ్యర్థన కేసులోనూ రమ్యకు చుక్కెదురైంది. ఆమె నరేశ్ ఇంటికి వెళ్లకూదని కోర్టు ఆదేశించింది. నరేశ్ తనను మోసం చేశాడని రమ్య, ఆమే తనను వేధిస్తోందని అతడూ పరస్పరం ఆరోపించుకోవడం తెలిసిందే. నటి పవిత్ర(Pavitra Lokesh) కు దగ్గరైన నరేశ్ ఆమెను త్వరలో పెళ్లాడనున్నారు. విడాకులు తీసుకోకుండా ఎలా కలసి ఉంటారంటూ రమ్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.