Home > సినిమా > మిస్టర్ ప్రెగ్నెంట్ : నర్సపల్లి సాంగ్కు మాస్ స్టెప్పులతో అదరగొట్టిన సోహెల్

మిస్టర్ ప్రెగ్నెంట్ : నర్సపల్లి సాంగ్కు మాస్ స్టెప్పులతో అదరగొట్టిన సోహెల్

X

బిగ్ బాస్ ఫేం సోహెల్, రూపా కొడవాయుర్ జంటగా రూపుదిద్దుకున్న మిస్టర్ ప్రెగ్నెంట్. మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన సెకండ్ సాంగ్ నరసపల్లి పాటకు సోహెల్ మాస్ బీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కనకవ్వ రాసి పాడిన నరసపల్లె పాట యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. ఆ పాటకు మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో సోహెల్ మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. కనకవ్వ రాసి పాడిన ఈ పాటకు సోహెల్ వేసిన స్టెప్పులు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న మిస్టర్ ప్రెగ్నెంట్ ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సోహెల్ కు జంటగా రూపా కొడవాయుర్ తో పాటు సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటిస్తున్నారు. కెమెరామెన్ నిజార్ షఫి కాగా.. రొన్నీ ఆడమ్స్ సంగీతం సమకూర్చారు.



Updated : 17 July 2023 2:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top