Home > సినిమా > ఆకట్టుకుంటోన్న ‘నరుడి బ్రతుకు నటన’ ఫస్ట్ గ్లింప్స్ వీడియో -

ఆకట్టుకుంటోన్న ‘నరుడి బ్రతుకు నటన’ ఫస్ట్ గ్లింప్స్ వీడియో -

ఆకట్టుకుంటోన్న ‘నరుడి బ్రతుకు నటన’ ఫస్ట్ గ్లింప్స్ వీడియో -
X

వరుస సినిమాలతో మంచి దూకుడుగా ఉంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. బలమైన కంటెంట్స్ తో ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆ బ్యానర్ నుంచి వస్తోన్న మరో సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. కేరళ బ్యాక్ డ్రాప్ లో అక్కడి అందాలను అద్భుతంగా చూపిస్తూ రూపొందిన సినిమా ఇది.

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాత. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు.

నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూస్తుంటే కేరళను అలా చుట్టి వచ్చినట్టుగా, మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.ఆకట్టుకుంటోన్న ‘నరుడి బ్రతుకు నటన’ ఫస్ట్ గ్లింప్స్ వీడియో

Updated : 6 April 2024 8:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top