Home > సినిమా > షారుఖ్‎కి షాకిచ్చిన బన్నీ..ఆనందంలో మెగా ఫ్యాన్స్..

షారుఖ్‎కి షాకిచ్చిన బన్నీ..ఆనందంలో మెగా ఫ్యాన్స్..

షారుఖ్‎కి షాకిచ్చిన బన్నీ..ఆనందంలో మెగా ఫ్యాన్స్..
X

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ గురువారం విడుదలైంది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి సూపర్ హిట్ టాక్‎తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ సినిమాల దూకుడుకి బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయిందిలే అనుకుంటున్న తరుణంలో పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులన్నిషారుఖ్ తిరగరాశారు . ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టారు . పఠాన్ సినిమా ఒకరకంగా బాలీవుడ్‎కి ప్రాణం పోసింది. ఇప్పుడు మరోసారి జవాన్ ద్వారా బాద్ షా తన సత్తాను చూపించాడు. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ. గత రికార్డులన్ని బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా కనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే.. పఠాన్‏లానే 1000 కోట్ల క్లబ్‎లో చేరే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. అది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‎కి సంబంధించినది కావడంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. జవాన్ సినిమాలో ఓ పాత్ర కోసం అల్లు అర్జున్‎ని అప్పట్లో మేకర్స్ అడిగారని వార్తలు వచ్చాయి. సినిమా చివరిలో వచ్చే సంజయ్ దత్ పాత్ర కోసం దర్శకుడు అట్లీ మొదట తమిళ హీరో విజయ్‎ని సంప్రదించాడు, ఆయన నో చెప్పడంతో తర్వాత టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‎ని అడిగారని టాక్ . అయితే ఆ పాత్రకు వీరిద్దరూ ఒప్పుకోకపోవడంతో చివరకు సంజయ్ దత్‎ను ఎన్నుకున్నాడు అట్లీ. అయితే ఇప్పుడు సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. అయితే బన్నీ చేయడం వలన సినిమాకు సౌత్‎లో ప్లస్ అయ్యేదేమో కానీ..బన్నికి పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండేది మరికొంతమంది అంటున్నారు .

ఈ మూవీలో లుంగీ కట్టుకుని జైలుకు వచ్చి షారుఖ్‎ని పట్టుకునే ఆఫీసర్ పాత్రలో అల్లు కనిపించేవాడు. అయితే సినిమాలో సంజయ్ దత్ ఆ క్యారెక్టర్‎లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారని టాక్ . బన్నీచేసినా అంతకు మించి ఉండేది కాదని... కాబట్టి బన్ని ఈ సినిమా చేయకపోవటమే మంచిదని అంటున్నారు. ఇక ‘జవాన్’ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో నయన్ బాలీవుడ్‎లోకి అడుగు పెట్టింది. అలాగే జవాన్ సినిమాతో దర్శకుడు అట్లీ సైతం బాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె కూడా ఓ పాత్రలో మెరిసింది. జవాన్ మూవీ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది. ఇదిలా ఉంటే ఇక అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‎ను బన్నీతో చేయబోతున్నాడు . అల్లు అర్జున్‎కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉంది .ఈ నేపథ్యంలో అట్లీ బన్నీ పాన్ ఇండియా ఇమేజ్‎ను మరింత పెంచేలా సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీకి కథ కూడా చెప్పాడని టాక్ . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.


Updated : 9 Sept 2023 5:07 PM IST
Tags:    
Next Story
Share it
Top