Home > సినిమా > Hi Nanna Movie: నాని సినిమా టీజర్ వస్తోంది..

Hi Nanna Movie: నాని సినిమా టీజర్ వస్తోంది..

Hi Nanna Movie: నాని సినిమా టీజర్ వస్తోంది..
X

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా హాయ్ నాన్న టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. నాని సరసన మృణాళినీ ఠాకూర్ హీరోయిన గా నటిస్తోన్న ఈ మూవీలో ఓ చిన్న పాప పాత్ర కీలకంగా ఉండబోతోంది. శౌర్యు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న హాయ్ నాన్న చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలూ బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. పాప, అమ్మాయి చుట్టూ అల్లుకున్న ఓ యువకుడి కథలా ఉండబోతోందని ఈ రెండు పాటలతో ఆడియన్స్ కు అర్థమైంది.

నాని ఇమేజ్ కు తగ్గట్టుగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ మూవీలో బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. ఆ విషయం ఇన్ డైరెక్ట్ గా ఈ టీజర్ లో ఉంటుందని టాక్. ఒకటిన్నర నిమిషం పాటు ఉండే టీజర్ తో సినిమాపై కంప్లీట్ గా ఒక క్లారిటీ వచ్చేలా.. కట్ చేశారని టాక్.

హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాతి రోజు సలార్ విడుదల అని చెప్పడంతో నాని మూవీ ప్రీ పోన్ అవుతోంది. దీంతో డిసెంబర్ 7 లేదా 8న విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మూవీ ఎలా ఉండబోతోందనేది ఈ నెల 15న విడుదలవుతోన్న టీజర్ తో ఓ క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.

Updated : 12 Oct 2023 6:21 PM IST
Tags:    
Next Story
Share it
Top