Home > సినిమా > ఆ విషయంలో చాలా గర్వంగా ఉంది..నవీన్ పొలిశెట్టి

ఆ విషయంలో చాలా గర్వంగా ఉంది..నవీన్ పొలిశెట్టి

ఆ విషయంలో చాలా గర్వంగా ఉంది..నవీన్ పొలిశెట్టి
X

కేవలం మౌత్ పబ్లిసిటీతో మ్యాజిక్ క్రియేట్ చేసింది ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ మూవీ. స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి డిఫరెంట్ స్టోరీతో ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్‎ను అందించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ మూవీ సక్సెస్‎ఫుల్‎గా దూసుకెళ్తోంది. ఈ విజయాన్ని యువ నటుడు నవీన్ పొలిశెట్టి ఫుల్‏గా ఎంజాయ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలు సైతం ఫోన్ చేసి పొగడ్తల వర్షం కురిపిస్తుంటే ఉబ్బితబ్బిబు అవుతున్నాడు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పర్సనల్‎గా కాల్ చేసి రెండు గంటలు సినిమా గురించే మాట్లాడటం, తన పర్ఫార్మెన్స్‎ను మెచ్చుకోవడంతో ఎంతో గర్వంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా సక్సెస్‎పై నవీన్ మాట్లాడుతూ..." చిరంజీవి గారు నాకు కాల్ చేశారు. రెండు గంటల పాటు మూవీ గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్‌‎ను మెచ్చుకున్నారు. ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు నేను సక్సెస్ సాధించిన మూడు సినిమాల్లో ఇది ఒకటి. ఈ మూవీతో కామెడీనే కాదు ఎమోషన్స్‌‎ను కూడా బాగా పండించగలనని నిరూపించుకున్నా. స్టాండప్‌ కామెడీ కాన్సెప్ట్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. నా కెరీర్‌లో బెస్ట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది అని అందరూ అంటున్నారు. పదేళ్ల కాలంలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీ అని ప్రశంసిస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. నేను అన్ని జోనర్ సినిమాల్లో నటించేందుకు ఇష్టపడతాను. ఈ సినిమా విజయంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. హిందీ సినిమాలు నా దగ్గరకు వచ్చాయి. కొన్ని కథలు విన్నాను . కానీ నా ఫస్ట్ ప్రయారిటీ తెలుగు సినిమాలకే"అని నవీన్ తెలిపాడు.



Updated : 22 Sept 2023 4:25 PM IST
Tags:    
Next Story
Share it
Top