Home > సినిమా > Nayanthara Insta : ఇన్‎స్టాలో ఆ ఒక్క టాలీవుడ్ హీరోయిన్‎ను మాత్రమే ఫాలో అవుతున్న నయన్

Nayanthara Insta : ఇన్‎స్టాలో ఆ ఒక్క టాలీవుడ్ హీరోయిన్‎ను మాత్రమే ఫాలో అవుతున్న నయన్

Nayanthara Insta : ఇన్‎స్టాలో ఆ ఒక్క టాలీవుడ్ హీరోయిన్‎ను మాత్రమే ఫాలో అవుతున్న నయన్
X

దక్షిణాది స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఈమెకున్నంత క్రేజ్ మరో హీరోయిన్‎కు లేదంటే అతిశయోక్తి కాదేమో. పాన్ ఇండియా లెవల్లో ఈ అందగత్తకు ఓ లెవెల్‎లో ఫాలోయింగ్ ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్. నయన్ నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. నయన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అని ఫిల్మ్ మేకర్స్‎కు ప్రగాఢనమ్మకం. అంతే కాదు అందుకు తగ్గట్లుగానే ప్రతి సినిమాలో సరికొత్త క్యారెక్టర్‎తో తనను తాను తెరముందు కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటుంది నటి. అలా వైవిధ్యమైన కథలో, నటనతో మెప్పిస్తూ ఇండస్ట్రీలో పెళ్లైన తరువాత కూడా తన క్రేజ్‏ను కంటిన్యూ చేస్తోంది. లేటెస్టుగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది నయన్. తన సినిమా ప్రమోషన్స్‎ను సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‎లో చేసేస్తోంది.

రీసెంట్‎గా ఇన్‎స్టాగ్రామ్‎లోకి ఎంట్రీ ఇచ్చింది నయన్. తన సోషల్ మీడియా ఎంట్రీతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఒక్కరోజులోనే నయన్ ను లక్షలాది మంది అభిమానులు ఫాలో అవ్వడం మొదలు పెట్టేశారు. ఇన్‎స్టాగ్రామ్‎ తన మొదటి వీడియోను పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది నయనతార. తన కొడుకులు ఉయిర్, ఉలకత్ లను రెండు చేతుల్లో ఎత్తుకుని ముఖాలకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మాస్ లుక్ లో నడుస్తూ నేను వచ్చానని చెప్పు అంటూ డైలాగ్ చెబుతూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేసిన క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.

ఇన్‎స్టాగ్రామ్‎లో నయన్‎ను ఒక్కరోజులోనే 1.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. అయితే నయన్ మాత్రం మొదటి రోజు 5 మందిని ఫాలో అయ్యింది. తాజాగా ఆమె ఇన్‎స్టాగ్రామ్‎లో మొత్తం 18 మందిని ఫాలో అవుతోంది. తన భర్త విఘ్నేష్ శివన్, షారుక్ ఖాన్, మిచెల్ ఒబామా, దీపికా పదుకొణె, ఆలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చప్రా, అనుష్క శర్మలతో పాటు పలువురు కోలీవుడ్ తారలను నయన్ ఫాలో అవుతోంది. అయితే అందులో మాత్రం ఒకే ఒక్క టాలీవుడ్ హీరోయిన్ ఉంది. ఆమెనే సమంత రూత్ ప్రభు. నయన్, సమంత, ఇద్దరు కలిసి గతంలో కణ్మణి రాంబో ఖతిజా సినిమా చేశారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. నయన్ భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులో విడుదల అయినా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అయినా ఈ లేడీ స్టార్స్ మధ్య బాండింగ్ మాత్రం స్ట్రాంగ్‎గా మారింది.

Updated : 2 Sept 2023 12:28 PM IST
Tags:    
Next Story
Share it
Top