Home > సినిమా > 50 సెకన్లకు నయన్ తీసుకునే రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

50 సెకన్లకు నయన్ తీసుకునే రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

50 సెకన్లకు నయన్ తీసుకునే రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
X

లేడీ సూపర్‌ స్టార్‌ అనగానే అందరికీ నయనతారనే గుర్తుకు వస్తుంది. తన నటనతో, అందంతో ఏ హీరోయిన్ సాధించలేని క్రేజ్‎ను దక్షిణాదిన దక్కించుకుంది ఈ బ్యూటీ. రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ లాంటి అగ్ర కథానాయకులతో నటించి తానేంటో నిరూపించుకుంది. నయన్ తో పాటే ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. పోయారు కానీ నయన్ మాత్రం తన క్రేజ్‎ను రోజు రోజుకు పెంచుకుంటూనే పోతోంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మళ్లీ ఫామ్‎లోకి వచ్చింది. ఈ మధ్యనే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటించి తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ కూడా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అమ్మడికి మరింత డిమాండ్ పెరిగింది. ఓ వైపు సినిమాలతో భారీగానే సంపాదిస్తున్న నయన్ లేటెస్టుగా ప్రకటనల ద్వారా కూడా కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా టాక్ వినిపిస్తోంది.

నయనతార ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టింది. మొదటి పోస్ట్ గా తన పిల్లల ఫోటోలను షేర్ చేసింది. ఆమె ఇన్‎స్టాలో అడుగుపెట్టిన నిమిషాల్లోనే లక్షలాది మంది ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం నయన్‎కు 32 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. నయన్ ఓ కొత్త స్కిన్ కేర్ కంపెనీని స్టార్ట్ చేసింది. ఆమె తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కంపెనీ ప్రాడక్ట్స్‎ను ప్రమోట్ చేస్తోంది. ఆన్‌లైన్‌లో ఈ ప్రాడక్ట్స్ ని విక్రయించాలనే ప్లాన్‎తోనే నయన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నయన్ సినిమాల ద్వారా కోట్లాది రూపాయల ఆస్తిని వెనకేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్. కేవలం 50 సెకన్ల యాడ్‎కి ఈ భామ ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోందట. 50 సెకెండ్లకు ప్రకటనల సమయం దాటితే తన రెమ్యునరేషన్‌ కూడా పెంచేస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ద్వారా కోట్లకు పడగలెత్తినా నయన తారా ఈ కొత్త మార్గాలతోనూ ఏడాదికేడాది తన ప్రాపర్టీని పెంచేసుకుంటోంది. ఏంతైనా స్టార్ హీరోయిన్ కదా ఆ మాత్రం రెమ్యునరేషన్ ఉంటుందిలే అని నయన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


Updated : 29 Sept 2023 7:15 PM IST
Tags:    
Next Story
Share it
Top