Nayanthara : నయనతార అసలు పేరు ఏంటో తెలుసా?.. ఈ ఫొటోలో ఉన్నది ఆమె అంటే నమ్ముతారా?
X
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన నటీమణుల్లో నయనతార ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం కన్నడ సినిమాల్లో నటించి అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తన రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి సగానికి పైగా హిట్స్ అందుకుంది. లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన ఈ భామ ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హీరోలకు సమానంగా 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ 20 ఏళ్లుగా పరిశ్రమ ఏకధాటిగా ఏలుతుంది. ఇక 2018 లో ఫోర్బ్స్ ఇండియన్ సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం చోటు సంపాదించుకోని శక్తివంతమైన మహిళగా నిలిచింది. అయితే నయనతార టాప్ సెలబ్రెట్‌గా ఎదగడం వెనక చాలా శ్రమ దాగి ఉంది. ఆమెకు ఇంతటి హోదా ఊరికే రాలేదు... ఇక నయనతార జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనలు, ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. మెుదట్లో క్రైస్తవ మతానికి చెందిన ఆమె తర్వాత హిందూ మతాన్ని స్వీకరించిన తన పేరును నయనతారగా మార్చుకున్నారు. సిని పరిశ్రమలో అడుగుపెట్టకముందు నయనతార. కైరలి టీవీలో ప్రసారమైన
ప్రముఖ మలయాళ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ షోలో హోస్ట్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది.
తాజాగా అప్పటికి టీవీ షో సంబంధించిన త్రో బ్యాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నయనతార సింపుల్ మేకప్ తో, నుదుటిపై చిన్న బొట్టుతో, నలుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉంది,
ఈ వీడియోను మెుదటిగా చూసిన ఎవరైనా ఆమె నయనతార అంటె నమ్మ లేకపోతున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. . 38 ఏళ్ల ఈ నటి 'గుర్తుపట్టలేనంతగా' కనిపిస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'అద్భుతమైన పరివర్తన' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. "డబ్బు అన్నీంటిని మారుస్తుంది' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
నయన్ కేరిర్ మెుదట్లో ‘మనసీనక్కరే’ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ నయనతారకు అంతగా పేరు రాలేదు. మురుగుదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాతో ఆమె కెరీర్ మారిపోయింది
స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిని ఏలుతూనే ఉంది.