Home > సినిమా > Kannappa movie: 17 ఏళ్ల తర్వాత జోడీకట్టిన ప్రభాస్, నయన్తార

Kannappa movie: 17 ఏళ్ల తర్వాత జోడీకట్టిన ప్రభాస్, నయన్తార

Kannappa movie: 17 ఏళ్ల తర్వాత జోడీకట్టిన ప్రభాస్, నయన్తార
X

వరుస ప్లాప్లు ఎదుర్కొంటున్న ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ (భక్త కన్నప్ప) సినిమాతో మరోసారి రాబోతున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథపై పనిచేస్తున్నాడు. ఈ సినిమాకు హిందీలో మహాభారత్ సీరియల్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు సరసన నుపూర్ సనన్ నటిస్తోంది.

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించ బోతున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. కన్నప్ప సినిమాలో ప్రభాస్.. శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరో తాజా వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. లీక్స్ ప్రకారం కన్నప్పలో పార్వతి పాత్రలో ప్రభాస్ సరసన నయన్ తార నటించబోతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే నిజం అయితే ఈ ఇద్దరు దాదాపు 17 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమా ఇదే అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పని జరుగుతుంది. దాదాపు 800 మంది ఆర్ట్ వర్కర్స్ సెట్స్, ఆర్టిస్ట్రీ తయారుచేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.


Updated : 23 Sept 2023 5:49 PM IST
Tags:    
Next Story
Share it
Top