Home > సినిమా > 50 సెకన్ల యాడ్‌ కోసం 5 కోట్లా..న్యాయమా నయన్?

50 సెకన్ల యాడ్‌ కోసం 5 కోట్లా..న్యాయమా నయన్?

50 సెకన్ల యాడ్‌ కోసం 5 కోట్లా..న్యాయమా నయన్?
X

సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో రెండు చేతులా డబ్బులు సంపాదిసోన్న నటి 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు వసూలు చేసింది. ఇంతకీ ఆ భామ ఎవరో కాదు..లేడీ సూపర్ స్టార్ నయనతార. సినిమాల్లోకి రాకముందు టీవీ యాంకర్‌గా చేసిన ఈ నటి ఇప్పుడు 'టాటా స్కై' యాడ్ కోసం ఏకంగా 5 కోట్లు తీసుకుందట. కేవలం 50 సెకన్ల యాడ్ కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ చూసి సినీ ఇండస్ట్రీ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి.

ఇకపోతే సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయన్ రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు నయన్ చేతినిండా సినిమాలున్నాయి. ఫుల్ డిమాండ్ ఉండటంతో ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చకచకా చేసేస్తోంది. బాలీవుడ్‌ డాన్ షారుఖ్‌తో జవాన్ మూవీ చేయడం నయన్ కెరీర్‌కు మరింత ప్లస్ అయ్యింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏకంగా 1000 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీకి భారీగా డిమాండ్‌ పెరిగింది. మొత్తానికి నయన్ కేవలం సౌత్‌ లోనే కాకుండా అటు బాలీవుడ్‌లో కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌‌ను క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతోంది.

Updated : 19 March 2024 6:47 PM IST
Tags:    
Next Story
Share it
Top