Home > సినిమా > Nayanthara : భర్తను అన్ ఫాలో చేసిన నయనతార

Nayanthara : భర్తను అన్ ఫాలో చేసిన నయనతార

Nayanthara : భర్తను అన్ ఫాలో చేసిన నయనతార
X

(Nayanthara) నయనతార - విఘ్నేష్ శివన్.. ఏడేళ్ల ప్రేమ తర్వాత 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లైన కొన్నాళ్లకే ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నయన్ ఇటీవలే ఇన్స్టాగ్రామ్లోకి అడుగుపెట్టింది. తన పిల్లల ఫొటోతో ఆమె ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమెకు 78లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే నయన్ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.





ఇన్స్టాలో నయన్ భర్త విఘ్నేష్ శివన్ను అన్ ఫాలో చేసింది. ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ చర్యతో వీరి మధ్య విభేధాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఉత్తిదే అని కొట్టిపారేస్తున్నారు. పొరపాటున అలా జరిగి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల విఘ్నేష్ పేరు కన్పించడం లేదంటూ మరొకరు కామెంట్ చేశారు. కాగా నయన్ ప్రస్తుతం టెస్ట్ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.





Updated : 2 March 2024 7:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top