Home > సినిమా > ఒక్క ఫోటోతో విడాకుల వార్త‌కు చెక్ పెట్టిన న‌య‌నతార‌!

ఒక్క ఫోటోతో విడాకుల వార్త‌కు చెక్ పెట్టిన న‌య‌నతార‌!

ఒక్క ఫోటోతో విడాకుల వార్త‌కు చెక్ పెట్టిన న‌య‌నతార‌!
X

తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతారకు సంబంధించి సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తన భర్త విఘ్నేష్‌కు నయనతార విడాకులు ఇవ్వనుందనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఆ వార్తలకు నయనతార చెక్ పెట్టింది. తన ఇన్‌స్టా ఖాతాలో ఓ కొటేషన్‌తో ఉన్న ఫోటోను ఆమె షేర్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆ జంటపై విడాకుల రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే ఆ రూమర్స్‌పై ఆమె స్పందించలేదు.

తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టారు. భర్త విఘ్నేష్‌తో పాటుగా తమ పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి నయనతార జెడ్డా టూర్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. విమానంలో తన ఫ్యామిలీతో వెళ్తున్న ఫోటోను ఆమె షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆమె తన భర్త విఘ్నేష్‌కు విడాకులు ఇవ్వడం లేదని తేలింది.

చాలా కాలం తర్వాత ఆమె తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. దీంతో నయనతార అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2022 జూన్ 9వ తేదీన నయనతార, విఘ్నేష్ జంటకు వివాహమైంది. అదే ఏడాది అక్టోబర్ నెలలో సరోగసీ ద్వారా ఆమె కవలలకు తల్లి అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈమధ్య ఆమె భర్తకు విడాకులు ఇస్తున్నారనే రూమర్ ఎక్కువైంది. ఆ వార్తలకు ఒక్క ఫోటోతో నయనతార చెక్ పెట్టారు.


Updated : 8 March 2024 3:10 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top