Home > సినిమా > అంచనాలను పెంచుతున్న NC23 ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్

అంచనాలను పెంచుతున్న NC23 ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్

అంచనాలను పెంచుతున్న NC23 ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్
X

నాగచైతన్య 23 వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇదొక యదార్ధ సంఘటనల ఆధారంగా రియల్ లొకేషన్లలో తీస్తున్న సినిమా. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రియలిస్టిక్ గా రూపొందించాలని మూవీ టీమ్ అనుకుంటోంది.అందుకే మొదలెట్టానికి ముందు ఆంధ్రలో తీరప్రాంతాలన్నీ చుట్టబెట్టేస్తున్నారు. దీనికి సంబంధించి ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ పేరుతో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.





అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఎన్సీ 23 సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మూవీ టీమ్. నాగచైతన్యతో సహా మూవీ టీమ్ అంతా ఆంధ్ర తీరప్రాంతాలలో తిరిగేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించారు. వరుసపెట్టి చై కు అన్నీ ఫ్లాపులు వస్తున్నాయి. దాంతో ఈ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో చైతన్య జాలరిగా నటిస్తున్నాడు. జాలరి వాళ్ళు ెలా బిహేవ్ చేస్తారో తెలుసుకుని వారి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి మూవీ టీమ్ వెంట అతను కూడా కె. మత్య్సలేశం గ్రామానికి వెళ్ళాడు. పాత్రలు, వారి బాడీ లాంగ్వేజ్, పల్లె పరిస్థితులు, జీవనశైలి వీటన్నింటినీ క్షున్ణంగా పరిశీలించడానికే అక్కడకు వెళ్ళామని చెబుతున్నాడు చై.

హైదరాబాద్ లో కూర్చుని కథ తయారు చేయడం కంటే డైరెక్ట్ గా తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజలు, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ , జాగ్రత్తలు తీసుకుని ప్రీప్రొడక్షన్ పనులను ముందుకు తీసుకువెళుతున్నామని అన్నారు దర్శకుడు చందు మొండేటి. గ్రామంలో ప్రతీ అంశాన్ని నోట్ చేసుకున్నామని చెప్పారు. అంతేకాదు మత్స్యకారుల వర్క్ లైఫ్ ను తెలుసుకోవడానికి వారితో పాటూ సముద్రంలోకి కూడా వెళ్ళారు.

మూవీ టీమ్ చేసిన ఈ ప్రయాణం మొత్తాన్ని ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ పేరుతో ఓ వీడియోలా రూపొందించారు. దాన్ని ప్రజెంట్ కూడా చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒక హీరో మూవీకి ముందు ఇలా లొకేషన్లను చూడ్డం, అక్కడి ప్రజలతో మాట్లాడడం హాట్ టాపిక్ అవుతోంది. నాగచైతన్య సినిమా మీద పెట్టిన ప్రత్యేక శ్రద్ధ మీద ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.



Updated : 8 Aug 2023 6:00 PM IST
Tags:    
Next Story
Share it
Top