Home > సినిమా > 60 లో ఇరవై లుక్స్.. మినిస్కర్ట్‌తో సీనియర్ యాక్ట్రస్

60 లో ఇరవై లుక్స్.. మినిస్కర్ట్‌తో సీనియర్ యాక్ట్రస్

60 లో ఇరవై లుక్స్.. మినిస్కర్ట్‌తో సీనియర్ యాక్ట్రస్
X

బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి దాదాపు సినీ అభిమానులందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో తల్లిగా, బామ్మగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది. ఈ మధ్యే ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో ఓటీటీలో విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. అయితే నీనా.. ఇటీవల ముంబైలో జరిగిన పార్టీకి హాజరై అందర్నీ షాక్ కు గురిచేశారు. నీనా ఆ పార్టీకి ఓ బ్లాక్ మినీ స్కర్ట్‌లో రావడం.. కెమెరాలకు ఫోజులివ్వడం హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ కలర్ టాప్, ఎత్తైన బూట్లు, మ్యాచింగ్ పర్స్‌, గ్లాసెస్‌తో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.





దీంతో వయస్సు గురించి పట్టించుకోకుండా సింపుల్ మేకప్‌, అందమైన చెవిపోగులు, డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఆనందంగా ఉందని నైస్ అవుట్‌ఫిట్ అంటూ తన అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. కొంతమందేమో ‘చాలా అసౌకర్యంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ దుస్తులు ఎందుకు ధరించాలి? చీరలోనే చాలా అందంగా కనిపిస్తారు’ అంటున్నారు. ఇకొందరైతే ‘మరీ దారుణం'అంటూ తిట్టిపోస్తున్నారు.




అయితే చాలామంది అభిమానులు మాత్రం ఆమెక్ సపోర్ట్ ఇస్తూ.. బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజలు ఒకరి వేషధారణ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం! సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్‌ని లైక్ చేసిన వారిని కూడా ఎందుకు అంగీకరించకపోలేకపోతున్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. వేరే వాళ్ల మీద ఎక్కువ శ్రద్ధ ఎందుకు చూపుతున్నారు. ఆమె తనని తాను అర్థం చేసుకునేంత తెలివైనదని అనుకుంటున్నాను అని ఒకరు కామెంట్ చేశారు. మీరు సామాజిక నిబంధనల గురించి ఆలోచించకుండా మిమ్మల్ని మీరు ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటున్నారో మరో నెటిజన్ పోస్ట్ చేశారు. వయసు మీద పడటం లేదు... కానీ మీరు ఆ డ్రెస్ ను అస్సలు క్యారీ చేయలేకపోయారు. అలా కాకుండా మీకు సౌకర్యంగా ఉండే చోట వేరే వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని ఉండాలి.... బూట్‌లు కూడా సరిగ్గా సరిపోలేదు అని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి 64 ఏళ్ల నీనా.. హాట్ లుక్ లో కనిపించి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది.







Updated : 11 Aug 2023 8:05 AM IST
Tags:    
Next Story
Share it
Top