Sidhu Jonnalagadda : ఇద్దరు హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన లేడీ డైరెక్టర్
X
ఆఫర్స్ లేని హీరోయిన్లు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో షోషల్ మీడియాను హీటెక్కిస్తుంటారు. వాటి ద్వారా కొత్త అవకాశాలు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో సడెన్ గా తెలుగులో డౌన్ అయిన బ్యూటీ రాశిఖన్నా కూడా అదే చేసింది. బట్ కొత్త ఛాన్సులు రాలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. ఫైనల్ గా అమ్మడికి ఓ ఆఫర్ వచ్చింది.. అన్నట్టు తెలుసు కదా.. తనతో పాటు ఓ ప్యాన్ ఇండియన్ కూడా ఈ మూవీలోనే ఆఫర్ అందుకుంది. ఈవిడది మరో కథ. మరి ఈ కథేంటీ.. ఆ సినిమా ఏంటీ.. అనేది చూద్దాం..
ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తర్వాత సడెన్ గా ఆఫర్స్ తగ్గాయంటే ఆ ఆర్టిస్టులు తట్టుకోలేరు. అలాగని వాళ్లు చేయగలిగిందీ ఏం లేదు. అందుకే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. తాము ఖాళీగా ఉన్నామనే సంకేతాలు ఇస్తూ ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. లాస్ట్ ఇయర్ తెలుగులో చేసిన పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాలు వరుసగా పోయాయి. తమిళ్ లో చేసిన సినిమాలూ అంతే. అయినా తమిళ్ లో రెండు ఆఫర్స్ ఉన్నాయి కానీ తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడే ఫేమ్ అయిన అమ్మడు మళ్లీ కొత్త అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా అనేక హాట్ ఫోటోషూట్స్ తర్వాత ఆఫర్ పట్టింది. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన దర్శకురాలుగా మారుతూ రూపొందిస్తోన్న తెలుసు కదా చిత్రంలో తనూ ఒక హీరోయిన్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో రాశిఖన్నాతో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కూడా మరో హీరోయిన్. అయితే శ్రీనిది కథ వేరే ఉంది.
కేజీఎఫ్ లాంటి ప్యాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ కు తర్వాత ఎన్ని ఆఫర్స్ రావాలి..? ఈవిడకు ఆఫర్స్ వచ్చాయి. కానీ అవన్నీ మీడియం రేంజ్ హీరోల సరసనే. దీంతో నేనేంటీ ఇంత పెద్ద హీరోయిన్ అయి ఉండీ ఈ హీరోలతో చేయడమేంటీ అని భీష్మించుకుంది. తనకూ యశ్ రేంజ్ లో క్రేజ్ వస్తుందనుకున్న శ్రీనిధికి అంత లేదు అని అర్థం కావడానికి టైమ్ పట్టింది. అయితే ఏ మాటకు ఆ మాట. అసలు కేజీఎఫ్ లో హీరోయిన్ ఉందన్న విషయం ఆడియన్స్ రిజిస్టర్ అయిన సందర్భాలున్నాయా.. ఏదో ఉందంటే ఉంది అన్నట్టుగా ఉంది తన పాత్ర. అందుకే ఏ టాప్ ఫిల్మ్ మేకర్ శ్రీనిధిని పరిగణలోకి తీసుకోలేదు. అయినా తనకు స్టార్ హీరోల సినిమాల్లోనే ఆఫర్స్ వస్తాయని ఇన్నాళ్లూ వేచి చూసింది. బట్ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇంకా లేట్ చేస్తే తనను మర్చిపోతారు అనుకుందేమో.. ఫైనల్ గా తెలుసు కదా నేను కేజీఎఫ్ హీరోయిన్ ని అంటూ ఈ మూవీలోకి ఎంటర్ అయింది. మొత్తంగా నీరజా కోన ఫస్ట్ మూవీతోనే ఇద్దరు హీరోయిన్లకు మళ్లీ లైఫ్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.