Home > సినిమా > ఒకే స్క్రీన్‌పై ఇద్దరు స్టార్ హీరోలు..జైలర్ -2 కు నెల్సన్ భారీ స్కెచ్

ఒకే స్క్రీన్‌పై ఇద్దరు స్టార్ హీరోలు..జైలర్ -2 కు నెల్సన్ భారీ స్కెచ్

ఒకే స్క్రీన్‌పై ఇద్దరు స్టార్ హీరోలు..జైలర్ -2 కు నెల్సన్ భారీ స్కెచ్
X

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'జైలర్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది . తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ మూవీ హ్యాట్రిక్ సాధించింది. జైలర్ సినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్‎తో పాటు మాలీవుడ్ స్టార్ మోహ‌న్ లాల్..శాండిల్ వుడ్ సంచ‌ల‌నం శివ‌రాజ్ కుమార్ క‌నిపిస్తే ఎలా ఉంటుందో? 'జైల‌ర్' రుచి చూపించింది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌ అని చెప్పక తప్పదు. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు కెవ్వు కేక అనిపించాయి. దీంతో రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే జైలర్ 2పై ఇప్పుడు ఫ్యాన్స్‎లో పెద్ద చర్చ నడుస్తోంది. సీక్వెల్ ఉండబోతోందని నెల్సన్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు. బీస్ట్' తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్న డైరెక్టర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ 'జైల‌ర్' తో మంచి స‌క్సెస్ సాధించి వాట‌న్నింటిని తుడిచి పెట్టేసాడు. ఇక జైలర్ 2 సినిమా లో సూపర్ స్టార్ ర‌జనీకాంత్‎తో పాటు కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్‎ని కూడా రంగంలోకి దించుతున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. ఇద్ద‌రి ఇమేజ్‎కి త‌గ్గ‌ట్టు సీక్వెల్ స్టోరి సిద్దం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచ‌న‌తో దిలీప్ ముందుకు వెళుతున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. 'జైల‌ర్' ఫ‌లితం విష‌యంలో విజ‌య్ సంతోషం వ్య‌క్తం చేసాడు . సినిమా హిట్ అని మొద‌టి మెసెజ్ విజ‌య్ నుంచే వ‌చ్చింది. ఆ త‌ర్వాత దిలీప్ బీస్ట్ ఫెయిలైన వైనాన్ని గుర్తు చేసారు. దీంతో విజ‌య్ కూడా పాజిటివ్‎గా స్పందించారు. 'మంచి ప్ర‌య‌త్నం చేసాం. అంద‌రికీ క‌నెక్ట్ అవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే మంచి సినిమా చేద్దాం అని విజయ్ ప్రామిస్ చేసారు. ఈ నేప‌థ్యంలో దిలీప్‎లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇదే టైంలో 'జైల‌ర్' సీక్వెల్ తెర‌పైకి రావ‌డం విశేషం.



కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ వీరాభిమానులు ఎక్కువే ఉన్నారు. తెలుగు , మలయాళం, కన్నడలోనూ ఈ స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తారు. మరి, వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని ఇది వరకే నెల్సన్ వెల్లడించాడు. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలంటి సందేహం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్ర‌స్తుతం టీమ్ 'జైల‌ర్' విజ‌యాన్ని ఆస్వాదిస్తుంది. ర‌జనీ ప్రస్తుతం హిమాల‌యా టూర్‎లో ఉన్నారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి కొత్త సినిమా షూటింగ్‎లో పాల్గొంటారు. అలాగే విజ‌య్ -లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'లియో' లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక జైలర్ 2 సినిమా పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 18 Aug 2023 3:44 PM IST
Tags:    
Next Story
Share it
Top