Home > సినిమా > చెప్పులు వేసుకున్న బండ్ల గణేష్.. నెటిజన్ల ఫైర్

చెప్పులు వేసుకున్న బండ్ల గణేష్.. నెటిజన్ల ఫైర్

చెప్పులు వేసుకున్న బండ్ల గణేష్.. నెటిజన్ల ఫైర్
X

బండ్ల గణేష్.. తన సినిమాల కన్నా మాటలతోనే ఫేమస్ అయిన వ్యక్తి. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక బండ్ల గణేష్ ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇటీవల ఆయన దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే వీడియోలో ఆయన చెప్పులు వేసుకోవడంపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ అయ్యప్ప మాల వేసుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోరు. కానీ ఆయన షేర్ చేసిన వీడియోలో కాళ్లకు చెప్పులు వేసుకుని ఉన్నాడు. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మాల వేసుకుని చెప్పులు వేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడానికా దీక్ష వేసుకున్నది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన్ను సమర్ధిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచించి చెప్పులు వేసుకున్నారేమో అని కామెంట్ చేస్తున్నారు.




Updated : 14 Nov 2023 7:39 PM IST
Tags:    
Next Story
Share it
Top