ఇదేం హోస్టింగ్ రా బాబు..నాగార్జునకు దండం పెడుతున్న నెటిజెన్స్..
X
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మొదలై వారం పూర్తైంది. ఈ వారం రోజులు హౌసులో చిత్ర విచిత్రమైన సంఘటలు.. ఊహకే అందని మలుపులు ఎన్నో జరిగాయి. ఈసారి సరికొత్త కంటెంటెతో బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సాగుతున్న ఏడో సీజన్‌లో ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త టాస్కులు కూడా ఇస్తున్నారు బిగ్ బాస్. దీంతో ఈ సీజన్‌పై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. అంతే కాదు ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ నయా పద్ధతిని ఫాలో అవుతున్న విషయం తెలిసిందే.
ఇక ఫస్ట్ వీక్ పూర్తి కావడంతో వీకెండ్లో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల లోపాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు నాగార్జున.ఈ ఎపిసోడ్లో రతికను ఓ రేంజ్లో పొగడ్తలతో ముంచేశారు హోస్ట్ నాగ్. ఆమెను పొగడటమే పనిగా పెట్టుకున్నారు. ఇక శుభ శ్రీని
యూజ్‌లెస్ ఫెలో.. అంటూ ఆమె పరువు తీసేశారు. ఇక ఉడత టాక్స్ గురించి నాగ్ తనదైన స్టైల్లో కంటెస్టులను పొగిగారు. ఉడత ఉడత ఊచ్ టాస్క్‌లో దాదాపుగా రెండున్నర గంటల పాటు పాట వినిపిస్తే..ఆ పాటలో ఉడత అనే పదం ఎన్నిసార్లు వినిపించిందని బిగ్ బాస్ అడగ్గా..1056 సార్లు అని రతిక వెంటనే సమాధానం ఇచ్చింది. ఈ టాస్క్‌లోనూ లతికను పొగిడేశారు నాగ్. రతిక ఐపీఎస్ పరీక్ష రాస్తే తప్పనిసరిగా పాస్ అవుతుందని ఆమెను ఆకాశానికి ఎత్తేసారు. అంతే కాదు బిగ్ బాస్ గేమ్‌షోలో ఆమెతో జాగ్రత్తగా ఆడాలంటూ మిగతా హౌస్‌మేట్స్‌ని హెచ్చరించారు.
ఇక కంటెస్టెంట్ గౌతమ్‌కు గట్టి షాక్ ఇచ్చారు నాగార్జున. ఈ గేమ్‌లో గౌతమ్ తనకి తాను 100 మార్కులు వేసుకున్నాడు..దీంతో వంద మార్కులు వేసుకునేంత సీన్ నీకు ఉందా? అని గౌతమ్ పరువు తీసేసారు నాగ్. నిజానికి నీ ఆటకి వారు ఇచ్చిన మార్కులే చాలా ఎక్కువంటూ సెటైరిక్‌గా గాలి తీసేశారు నాగార్జున. ఇక మరో కంటెస్టెంట్ అమర్ దీప్ తనకి 97 మార్కులేసుకున్నాడు. ప్రేక్షకులు మాత్రం 61 మార్కులేశారు. దీంతో అమరదీప్ నువ్వు బాగా ఆడటం లేదని అనేసారు నాగార్జున. దీంతో ఈ షో చూసిన ఆడియాన్స్ మాత్ర ఫుల్‌గా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అలను షోను నాగార్జున చూస్తున్నారా? లేదా? అన్న డౌట్స్ ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. సరిగా గేమ్ ఆడని వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారు..ఆడే వాళ్లకి క్లాస్ తీసుకుంటున్నారు ఎందుకబ్బా? ఉల్టా.. పల్టా అంటే ఇదేనేమో అని అంటున్నారు. మీ హోస్టింగ్ కి ఓ దండం అంటూ కామెట్లు పెడుతున్నారు.