మందు’ అమ్మాయిల వీడియో షేర్ చేసిన కస్తూరి
X
నటి కస్తూరి.. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటి. కానీ ఇప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటోంది. నాగార్జున అన్నమయ్య, బాలయ్య నిప్పురవ్వ, మోహన్‌బాబు సోగ్గాడి పెళ్లాం,రాజశేఖర్ మా ఆయన బంగారం వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇప్పుడు పలు టీవీ సీరియల్స్, షోల్లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమా, ఇటీవల గిరిజన యువకుడిపై మూత్రం పోయడం వంటి సంఘటనలపై కస్తూరి చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆమె ఇద్దరు అమ్మాయిలు ఓ మద్యం షాపులో ఆల్కహాల్ కొంటున్న వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘అమ్మాయిలు బాగా తాగండి.. 8 మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు.. ఇది ఏ మాత్రం తప్పు కాదు. మహా అయితే ఇది వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది’’ అంటూ రాసుకొచ్చింది
தண்ணியடி, பெண்ணே தண்ணியடி !
— Kasturi (@KasthuriShankar) July 13, 2023
எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண்
இளைப்பில்லை காணென்று தண்ணியடி.
WhatsApp fwd of the day. As received.
Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp
ఆమె చేసిన ఓ ట్వీట్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ అమ్మాయిల వ్యక్తిగత జీవితానికి చెందిన విషయాన్ని ఎందుకు షేర్ చేశారని మండిపడుతున్నారు. చాలా మందిని తప్పుదోవ పట్టించేలా మీ పోస్ట్ ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. అమ్మాయిలు మందు కొట్టాలని మీరు ప్రోత్సహిస్తున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇక ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా కస్తూరి పోస్ట్‌పై స్పందించింది. ‘నిజాయతీగా చెబుతున్నా.. కస్తూరి నువ్వు ఇలాంటి వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు’ అంటూ కస్తూరిపై మండిపడింది. దీంతో నెటిజన్లు కూడా చిన్మయికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.