Home > సినిమా > Animal Movie :యానిమల్ సినిమా నుంచి నయా పోస్టర్

Animal Movie :యానిమల్ సినిమా నుంచి నయా పోస్టర్

Animal Movie :యానిమల్ సినిమా నుంచి నయా పోస్టర్
X

మొన్నటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన బాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. (Animal Movie New poster) "స్టార్ హీరో షారుక్ ఖాన్ పఠాన్ సినిమా పుణ్యమా మళ్లీ బాలీవుడ్ ట్రాక్‎లో పడింది." ఈ మూవీ సంచలన విజయం సాధించడం మాత్రమే కాదు వసూళ్ల పరంగా కూడా బ్లాక్‎బస్టర్‎గా నిలిచింది. పఠాన తర్వాత బాలీవుడ్‏లో విడుదలైన దృశ్యం, బ్రహ్మాస్త్ర, గదర్‌ 2 సినిమాలతో పాటు రీసెంట్‎గా రిలీజ్ అయిన జవాన్ మూవీ భారీ హిట్ సాధించడంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ టైంలోనే బాలీవుడ్‎లో తన సత్తాను చూపించేందుకు రెడీ అయ్యాడు అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‎తో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీకి సంబంధించిన అప్‎డేట్స్ అందిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి రణబీర్ కపూర్,రష్మిక , అనీల్ కపూర్‎ల పోస్టర్లను విడుదల చేసి సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాడు. తాజాగా మూవీలో విలన్‎ను ఇంట్రడ్యూజ్ చేశాడు. యానిమల్ కా ఎనిమీ అంటూ బాబీ డియోల్ లుక్‎ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ లుక్‎కు సినీ లవర్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది.

బీలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ‘యానిమల్’ సినిమాలో విలన్‎గా కనిపించబోతున్నాడు. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌‎లో ఓ రేంజ్‎లో కనిపించాడు. యానిమల్ కా ఎనిమీ అంటూ విడుదలైన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లుక్‎లో ముఖం నిండా రక్తంతో బాబీ డియోల్ ఎంతో వైలెంట్‎గా కనిపించాడు. యానిమల్ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాబీ డియోల్ నెగిటివ్ పాత్రలు పోషించడం ఇదే మొదటిసారి కాదు ఇప్పటికే ల‌వ్ హాస్ట‌ల్ మూవీలో విల‌న్‌గా కనిపించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇక యానిమల్‌లోనూ తన విశ్వరూపాన్ని చూపించేందుకు బాబీ డియోల్ రెడీ అయ్యాడు. ఈ క్రమంలో ప్రేక్షకులు ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 28న టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 26 Sept 2023 2:56 PM IST
Tags:    
Next Story
Share it
Top