హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టిన మహి వి రాఘవ్
X
దర్శకుడు మహి వి రాఘవ్ హ్యాట్రిక్ కొట్టాడు. షో రన్నర్ గా వ్యవహరించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి వారంలోనే వ్యూయర్షిప్ పరంగా దూసుకుపోతున్న ఈ సిరీస్ డైరెక్టర్‌కి మంచి హిట్‌ను ఇచ్చింది. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 బ్లాక్ బస్టర్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన ‘షైతాన్’ సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహీ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.
నిర్మాత, దర్శకుడు మహి తన బ్యానర్‌లో మూడు చిత్రాలకు షో రన్నర్‌గా వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ.. మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ప్రేక్షకులు తమ కథలకు బాగా కనెక్ట్ అయ్యారని, ఓటీటీలో తమ వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వెబ్ సిరీస్‌లు తీసి ప్రేక్షకులను అలరిస్తామని అన్నారు.