Home > సినిమా > సలార్ స్టోరీ లైన్ లీక్..! ‘కేజీఎఫ్లో ఆ క్యారెక్టరే.. సలార్లో ప్రభాస్’

సలార్ స్టోరీ లైన్ లీక్..! ‘కేజీఎఫ్లో ఆ క్యారెక్టరే.. సలార్లో ప్రభాస్’

సలార్ స్టోరీ లైన్ లీక్..! ‘కేజీఎఫ్లో ఆ క్యారెక్టరే.. సలార్లో ప్రభాస్’
X

డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి క్రేజ్ మామూలుగా లేదు. ఆదిపురుష్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో హైప్ పెరిగిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ కు భారీ హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాంగిల్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక మూవీ టీం విడుదల చేసిన తాజా టీజర్.. సినిమా కథపై మరింత ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





కేజీఎఫ్ సినిమాకు సలార్ కు లింక్ ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా ‘కేజీఎఫ్ లో రాఖీ ఫ్రెండ్.. సలార్ లో ప్రభాస్’ అంటూ మరో వార్త చక్కర్లు కొట్టింది. ఈ వార్తను మూవీ టీం అనౌన్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు. అయితే తాజాగా మరో వార్త అభిమానుల్లో హైప్ పెంచుతోంది. ‘అనాథగా మారిన రాఖీకి ఇద్దరు స్నేహితులు పరిచయం అవుతారు. వాళ్లతో కలిసి షూ పాలిష్ చేస్తూ బతుకుతుంటాడు రాఖీ. అందులో ఒకడే సలార్. రాఖీ చివరి రోజుల్లో సలార్ ను కలిసా’డంటూ స్టోరీని చెప్తున్నారు. స్టోరీ అఫీషియల్ ది కాకపోయినా.. వినడానికి మాత్రం బాగుంది. ఈ కథతో సినిమా తెరకెక్కినా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం కాయం అంటున్నారు అభిమానులు.















Updated : 11 July 2023 11:33 AM IST
Tags:    
Next Story
Share it
Top