డ్రగ్స్ కేసులో ప్రముఖ నటికి ఎన్ఐఏ నోటీసులు
X
తమిళ స్టార్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ కు కేరళ ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేరళలో రాష్ట్రంలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ కోసం వరలక్ష్మీకి సమన్లు పంపారు. ఈ కేసులో ఆమె వద్ద పీఏగా పనిచేసిన ఆదిలింగంకు డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు కొచ్చి పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. తాజాగా ఎన్ఐఏ అతన్ని కస్టడీలోకి తీసుకుని కీలక నిందితుడిగా పరిగణించింది.
దీంతో ఆదిలింగంకు సంబంధించిన పూర్తి వివరాల సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఎన్ఐఏ అధికారులు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేరళలోని విళంజియంలో భరీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఆదిలింగంను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించగా.. డ్రగ్స్ సరఫరా చేసిన డబ్బుతో సినిమాల్లో ఇన్వేస్ట్ చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. ఈ కేసులో వరలక్ష్మికి ఏమైనా సంబంధం ఉందా? ఆదిలింగం ఏమైనా వరలక్ష్మికి డ్రగ్స్ ఏమైనా సరఫరా చేశాడా అనే కోణంలో ఎన్ఐఏ విచారించనుంది.