Home > సినిమా > Breaking News : ప్రచారానికి చెక్.. నిహారిక, చైతన్య విడిపోయారు..

Breaking News : ప్రచారానికి చెక్.. నిహారిక, చైతన్య విడిపోయారు..

Breaking News : ప్రచారానికి చెక్.. నిహారిక, చైతన్య విడిపోయారు..
X

మెగా డాటర్ నిహారిక కొనిదెల వివాహం బందం గురించి చాలా రోజులగా వస్తున్న రూమర్స్ కు తెరపడింది. నిహారిక.. తన భర్త చైతన్యతో చాలాకాలంగా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మనస్పర్థల వల్ల వీళ్లిద్దరు విడిపోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు నిజం అయ్యాయి. హిందూ వివాహ చట్ట ప్రకారం.. నిహారిక, చైతన్య మ్యూచువల్ అంగీకారంతో మే 19న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. దానిపై మంగళవారం (జులై 4) విచారణ జరుగగా.. ఇద్దరికీ విడాకులు ఇస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది.

2020 డిసెంబర్ 9న చైతన్యం, నిహారికల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు వచ్చి.. దూరంగా ఉన్నారు. ఇక ఆ మధ్య చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌ లోని నిహారికకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు అందరికీ అనుమానం వచ్చింది. ఇది జరిగిన కొన్నిరోజులకు నిహారిక కూడా చైతన్య ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో అందరికీ క్లారిటీ వచ్చింది. తాజాగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కు కూడా నిహారిక ఒక్కతే హాజరయింది.





Updated : 4 July 2023 2:43 PM GMT
Tags:    
Next Story
Share it
Top