Home > సినిమా > విడాకుల గురించి తొలిసారి స్పందించిన నిహారిక.. పోస్ట్ వైరల్

విడాకుల గురించి తొలిసారి స్పందించిన నిహారిక.. పోస్ట్ వైరల్

విడాకుల గురించి తొలిసారి స్పందించిన నిహారిక.. పోస్ట్ వైరల్
X

చాలాకాలంగా మెగా డాటర్ నిహారిక, తన భర్త చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు.. అనే వార్తకు మంగళవారం (జులై 4) తెరపడింది. కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్ట్ విడాకుల మంజూరు చేసింది. ఏప్రిల్ 1న వీళ్లిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసుకోగా.. జూన్ 5న విడాకులు మంజూరయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ క్రమంలో నిహారిక తొలిసారి విడాకుల విషయంపై స్పందించింది.





చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడాకులను తీసుకుంటున్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో నిహారిక పోస్ట్ పెట్టింది. అభిమానుల్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టిన నిహారిక.. ‘ఈ సున్నిత సమయంలో మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది గురిచేయకండి. మేమిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీని కోరుకుంటున్నాము. దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకాలం నాకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు కృతజ్ఞతలు’ అని కోరింది. నిహారిక మాజీ భర్త చైతన్య కూడా ఇదే విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.






Updated : 5 July 2023 2:01 PM IST
Tags:    
Next Story
Share it
Top