నువ్వే మా జీవితంలో వెలుగునింపావ్..నిహారిక
X
భర్త చైతన్యతో డివోర్స్ అన్న అంశం తెరమీదకు వచ్చిన్పటి నుంచి మెగా డాటర్ నిహారిక పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తోంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడాకులు తీసుకున్నామని మాకు కాస్త ప్రేవసీని ఇవ్వండంటూ నిహారిక విజ్ఞప్తి చేసినా వీరి డివోర్స్‌కు సంబంధించి ఏదో ఒక న్యూన్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంది. అయినా చైతన్య, నిహారిక వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.
విడాకుల తరువాత నిహారిక తన కెరీర్‌పై దృష్టి సారించింది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. చైతూ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు తన ఫ్రెండ్స్‌తో టూర్స్‌కి వెళ్తూ కాలక్షేపం చేస్తోంది. అప్పుడప్పుడు నెట్టింట్లో హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు చేస్తూ తీరికలేకుండా గడుపుతోంది నిహారిక. రీసెంట్గా డెడ్ పిక్సల్ అనే వెబ్ సీరీస్‌తో అలరించిన నిహారిక త్వరలోనే ఓ మూవీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డివోర్స్ తర్వాత నిహారిక హుషారు రెట్టింపు అయ్యింది. లేటెస్టుగా నిహారిక తన బెస్ట్ ఫ్రెండ్ గురించి షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవ, నిహారికలు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వీరిద్దరి ఫ్రెండ్ షిప్ బాండ్ కొనసాగుతుంది. ఇశాళ కాలభైరవ బర్త్ డే. దీంతో నిహారిక తన స్నేహితుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే బాబు.. నువ్వే మా జీవితాల్లో వెలుగును నింపావ్ థాంక్యూ.. లెట్స్ హ్యావ్ ఫన్ డే ’అని కాలభైరవతో దిగిన ఫిక్స్‌తో పాటు ఈ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.