Home > సినిమా > విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక కొణిదెల

విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక కొణిదెల

విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక కొణిదెల
X

నాగాబాబు కూతురు, మెగా డాటర్ గా నిహారిక కొణిదెల మనందికి పరిచయమే. మెగా కుటుంబం ఆధ్వర్యంలో చైతన్య జొన్నలగడ్డ, నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్ద‌రి మధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో పెళ్లైన రెండేళ్ల‌కే వీరిద్దరూ దూర‌మయ్యారు. అయితే విడాకుల‌కు గ‌ల కార‌ణాల‌పై చైత‌న్య గానీ...నిహారిక గానీ ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా స్పందించ‌లేదు. లేటెస్ట్ గా ఒక ఇంటర్యూలో నిహారిక భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది.

పెళ్లి తర్వాత తను ఏ సినిమాలు చేయలేదని.. పెళ్లి చేసుకున్నందువల్లే సినిమాలు మానేశానని చాలామంది అనుకున్నారని తెలిపారు. తన వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న చాలా మంది అడిగినట్లుగా చెప్పారు. సినిమాల్లో పని చేయడం మా వృత్తి అని మేమెందుకు దాన్ని వదిలేస్తామని తేల్చి చెప్పారు. నిర్మాతగా కొంచెం బిజీ అవడంతో నటనకు దూరమయినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని సూచించారు. అది తెలియకుండా మనకు సెట్‌ అవని వ్యక్తిపై ఆధారపడకూడదన్నారు.

ఇంట్లో తల్లిదండ్రుల్లా అంత ప్రేమగా వారు అస్సలు చూసుకోలేరని చెప్పారు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో ఈ మధ్యే నేర్చుకున్నానట్లు వివరించారు. తనది పెద్దలు కుదిర్చిన సంబంధమన్నారు. విడాకులు తీసుకున్నప్పుడు చాలా మంది చాలామాటలన్నారని అవన్నీ విన్నప్పుడు ఎంతో బాధేసి చాలా సార్లు ఏడ్చినట్లు చెప్పారు. ఈ బాధను భరించడం అంత ఈజీ కాదన్నారు. ఎవరైనా జీవితాంతం కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారని.. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఘనంగా జరుపుకోరని స్పష్టం చేశారు. అందరూ కోరుకున్న విధంగా తాను కూడా రిలేషన్‌షిప్‌ సంతోషంగాపూ కొనసాగాలని కొరుకున్నట్లు చెప్పారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవనీ తన పెళ్లి కూడా అలాంటిదేనని చెప్పారు. తన గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్నే కాదని...కానీ క్యారెక్టర్‌ను తప్పుపట్టడం, కుటుంబాన్ని దూషించడంతో తట్టుకొలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కష్ట సమయంలో తన కుటుంబం అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఈ రెండేండ్లలో కుటుంబ విలువలతో పాటు విడాకుల తర్వాత ఎవరినీ అంత ఈజీగా నమ్మొద్దని తెలిసొచ్చిందని చెప్పారు. ఇదొక గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూసుకొంటానన్నారు. అంతేగాక ఇప్పటికీ తనకు 30 ఏండ్లేనని....ఎప్పటికీ ఇలా సింగిల్ గా ఉండకుండా మంచి వ్యక్తి కనిపిస్తే తప్పకుండా పెండ్లి చేసుకుంటానని నిహరిక చెప్పారు.




Updated : 26 Jan 2024 8:00 PM IST
Tags:    
Next Story
Share it
Top