Home > సినిమా > 'కార్తీక దీపం' సీక్వెల్ వచ్చేస్తోంది..ఇక మగాళ్లకు తలనొప్పులు స్టార్ట్!

'కార్తీక దీపం' సీక్వెల్ వచ్చేస్తోంది..ఇక మగాళ్లకు తలనొప్పులు స్టార్ట్!

కార్తీక దీపం సీక్వెల్ వచ్చేస్తోంది..ఇక మగాళ్లకు తలనొప్పులు స్టార్ట్!
X

బుల్లితెరపై అనేక సీరియల్స్ ప్రసారం అయ్యుంటాయి. కానీ అన్నింటిలోకంటే ఎక్కువగా బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన సీరియల్స్ కొన్నే ఉన్నాయి. అందులో కార్తీకదీపం సీరియల్ ముందు వరుసలో ఉంటుంది. చాలా మంది మహిళలు ఈ సీరియల్ చూస్తూ తమను తామే మర్చిపోయేవారు. కార్తీకదీపం సీరియల్ ప్రభావం అలా ఉండేది మరి. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్కగా నటించిన నిరుపమ్, ప్రేమి విశ్వనాధ్ తమ ఒరిజినల్ పేర్లను మర్చిపోయేంతలా ఈ సీరియల్ ప్రభావం చూపింది.

2017 అక్టోబర్ నెలలో ప్రారంభమైన కార్తీకదీపం సీరియల్ 2022 జనవరి వరకూ సాగింది. అలా సాగుతూ సాగుతూ తెలుగు మహిళా ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఆ సీరియల్ మహిళలకు ఒక డ్రగ్ లాగా అయిపోయిందని చెప్పాలి. చాలా మంది మహిళలు ఆ సీరియల్ టైంలో ఇంటికొచ్చిన భర్తలకు భోజనం పెట్టేవారు కాదని, సీరియల్‌లో నిమగ్నమై తమ కుటుంబాన్నే మర్చిపోయేవారని సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు కూడా వైరల్ అయ్యాయి.

మగాళ్లంతా కార్తీకదీపం సీరియల్ టైంలో తలనొప్పులు పడేవారని, ఎంత మొత్తుకున్నా భార్య చేతిలోంచి టీవీ రిమోట్ కూడా తీసుకోలేకపోయేవారని ఆ మధ్య చర్చలు కూడా సాగాయి. సిరీయల్ ప్రసారం కాని రోజుల్లో కూడా ముందు భాగాలు వేయమని చాలా మంది మా టీవీ వారికి మొర పెట్టుకున్నారు. సీరియల్ అయిపోయే టైంలో తమ ఇంట్లోవాళ్లు చనిపోతే ఎలా ఏడుస్తారో అలా చాలా మంది మహిళలు ఏడ్చారు. ఆ తర్వాత ఆ సీరియల్‌కు ఎండ్ కార్డు పడింది. ఇక మగాళ్లంతా హమ్మయ్యా అని అనుకున్నారు. కానీ వారికి ఆ ఆనందం ఇక ఉండదు అనిపిస్తోంది.

తాజాగా కార్తీకదీపం సీరియల్‌కు సీక్వెల్ వస్తోంది. ఆ సీరియల్ ప్రోమోను మా టీవీ విడుదల చేసింది. దీంతో మగాళ్ల గుండెలు బరువెక్కాయి. మళ్ళీ నిరుపమ్, ప్రేమి విశ్వనాధ్‌లు బుల్లితెరపై కనిపించనున్నారు. ఈ సీరియల్ కోసం మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కార్తీకదీపం కంటే ఓ రేంజ్‌లో ఈ సీరియల్ టీఆర్పీలు బద్దలు కొడుతుందేమోనని చూస్తున్నారు. మొత్తానికి పాపం మగమహారాజుల తలనొప్పి మరికాస్త పెరగనుందని పలువురు చర్చించుకుంటున్నారు.


Updated : 26 Feb 2024 7:23 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top