రామాయణం ప్రాజెక్ట్పై వెనక్కి తగ్గను : బాలీవుడ్ డైరెక్టర్
X
రామాయణ కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. రామాయణాన్ని వక్రీకరించి సినిమా తీశారన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వచ్చాయి. హిందూ సంఘాలు పలుచోట్ల షోలను కూడా అడ్డుకున్నారు. రామాయణంలోని కొంత భాగాన్ని మాత్రమే సినిమాగా తీశామని డైరెక్టర్ చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక మరో బాలీవుడ్ డైరెక్టర్ రామయణ ప్రాజెక్ట్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆదిపురుష్ తర్వాత పరిస్థితులు మారిన.. తన సినిమాపై వెనక్కి తగ్గనని ఆ డైరెక్టర్ స్పష్టం చేశారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేశారు. ఆదిపురుష్ తీవ్ర విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్న తరుణంలో నితీశ్ తన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారా? లేదా? అనే సందేహం సినీ ప్రియుల్లో నెలకొంది. ఈ క్రమంలో నితీష్ స్పందించారు. రామాయణ ప్రాజెక్ట్ విషయంలో తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. తన సినిమా ఎవరి మనోభావాలను కించపరచవని అన్నారు.
ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తారని నితీష్ ఇప్పటికే ప్రకటించారు. ‘‘త్వరలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తా. నటీనటులు, ఇతర చిత్రబృందానికి సంబంధించిన విషయాలు ఇప్పుడే చెప్పను. నార్త్, సౌత్కు చెందిన నటీనటులతో ఈ సినిమా తెరకెక్కిస్తా’’ అని నితీష్ తివారీ చెప్పారు. 2011లో చిల్లర్ పార్టీ అనే మూవీతో డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఈ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత దంగల్, చిచోరే చిత్రాలతో సూపర్‌హిట్స్ అందుకున్నారు. తాజాగా ఆయన బవాల్ మూవీని తెరకెక్కించారు. జాన్వీకపూర్ - వరుణ్ ధవన్ జంటగా నటించిన ఈ సినిమా జులై 21న రిలీజ్ కానుంది.