హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం
X
హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయానని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన అమ్మమ్మ, తాతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది.’ఒక శకం ముగిసింది. గుడ్‌బై అమ్మమ్మా.. నా చెర్రీమ్యాన్. సీ యూ ఆన్ ది అదర్ సైడ్’ అంటూ భావోద్వేగానికి లోనైంది. నిత్య షేర్ చేసిన ఈ ఫొటోలో నిత్యని వాళ్ల అమ్మమ్మ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకోవడం కనిపిస్తుంది. వాళ్లిద్దరి మధ్య బాండింగ్ ఈ ఫొటో తెలియజేస్తుంది. దీనిపై నిత్యా అభిమానులు స్పందిస్తూ.. ధైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ సెక్షన్‌లో చెబుతున్నారు.
నాని సరసన అలా మొదలైంది సినిమాలో నటించిన ఈ కేరళ కుట్టి తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఇష్క్, ఒక్కడినే, గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, సన్ ఆఫ్ సత్యమూర్తి, వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బీమ్లా నాయక్ మువీలో నిత్యా నటించిన సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటి వరకు 50కి పైగా మువీల్లో నటించింది. ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే వెబ్ సిరీస్‌లతోనూ సిద్ధమవుతోంది.