Home > సినిమా > ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డా.. ఆ హీరో రూమ్కు పిలిచేవాడు: నిత్యా మీనన్

ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డా.. ఆ హీరో రూమ్కు పిలిచేవాడు: నిత్యా మీనన్

ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డా.. ఆ హీరో రూమ్కు పిలిచేవాడు: నిత్యా మీనన్
X

నానీతో పాటు అలా మొదలైంది సినిమాలో నటించి టాలీవుడ్ కు పరిచయం అయింది నిత్యా మీనన్. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి పాపులర్ అయింది. దాంతో తెలుగుతో పాటు మళయాళం, కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం నిత్యా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది నిత్యా. ఇండ్ట్రీలో చాలామంది కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు పలువురు హీరోయిన్లు. తాజాగా నిత్యా మీనన్ కూడా తనకు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

‘టాలీవుడ్ లో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఓ తమిళ సినిమా షూటింగ్‌ టైంలో చాలా ఇబ్బంది పడ్డా. ఓ హీరో నాతో తప్పుగా ప్రవర్తించాడు. షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ.. పిచ్చిగా బిహేవ్ చేశాడు. తన రూమ్ కి రమ్మని ఒత్తిడి తెచ్చాడు’ అని తెలిపింది. ప్రస్తుతం నిత్యా చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.


Updated : 20 Jun 2023 8:32 PM IST
Tags:    
Next Story
Share it
Top