వెండి తెరపై మరో రామాయణం.. సీతగా సాయి పల్లవి
X
రామాయణ గాధతో.. వెండి తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా.. ప్రతీది ప్రత్యేకమే. ప్రస్తుతం.. అదే కథపై విజువల్ వండర్ గా ఆదిపురుష్ రాబోతోంది. అయితే, త్వరలో మరొక సినిమా రాబోతున్నట్లు వార్తుల వినిపిస్తున్నారు. ఈ సినిమాలో నాచురల్ స్టార్ సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తున్నట్లు.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
అంతేకాదు ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా హృతిక్ రోషన్ చేయనున్నారట. అయితే, ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్ నితీష్ తివారీ ప్రస్తుతం వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న.. బవాల్ సినిమాలో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. నితీష్ రామాయణం స్టోరీపై ఫోకస్ చేయనున్నాడట. అయితే, తను తెరకెక్కించబోయే సినిమాకు రామాయణంలోని ఏ ఘట్టాన్ని తీసుకుంటాడనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.