Home > సినిమా > శ్రీ లీల కథ ముగిసినట్టేనా..?

శ్రీ లీల కథ ముగిసినట్టేనా..?

శ్రీ లీల కథ ముగిసినట్టేనా..?
X

టాలీవుడ్ లోకి ధమాకాలా దూసుకువచ్చింది శ్రీలీల. ఫస్ట్ మూవీ పెళ్లి సందడితోనే అందరినీ అట్రాక్ట్ చేసింది. తన ఛలాకీతనం చూసి టాలీవుడ్ ఫిదా అయింది. ఆ వెంటనే వచ్చిన ధమాకాలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ అమ్మడు చేసిన హంగామా చూసి అడ్వాన్సులే అడ్వాన్సులు అన్నట్టుగా మారింది. వరసగా ఆఫర్స్. బట్ ఇక్కడే పాపకు లక్ అడ్డం తిరగింది. బాలకృష్ణ కూతురుగా నటించిన భగవంత్ కేసరి తప్ప మిగతా అన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గానే నిలిచాయి.

స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీమేన్, గుంటూరు కారం.. గుంటూరు కారం కమర్షియల్ గా ఓకే అనిపించుకుందని మేకర్స్ చెప్పినా.. చాలామంది డిజాస్టర్ గానే తేల్చారు. ముఖ్యంగా ఈ అన్ని సినిమాల్లోనూ కామన్ మేటర్ ఏంటంటే.. శ్రీ లీల నటన. ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఏ మాత్రం అప్డేట్ కాలేదు. ఇక తన డైలాగ్ డెలివరీ అంటేనే ఇరిటేట్ అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. అన్ని డైలాగ్స్ ను ఒకే మాడ్యులేషన్ లో చెబుతూ.. మీనింగ్ లెస్ అనిపించడంలో ఎక్స్ పర్ట్ అయిందంటారు. దీంతో ఒకప్పుడు హాట్ కేక్ లా కనిపించిన శ్రీ లీలను చూస్తేనే నిర్మాతలు భయపడిపోతున్నారు.

ప్రస్తుతం తన చేతిలో పవన్ కళ్యాణ్ తో నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. ఇది వస్తుందా లేదా అనేది ఏపి ఎన్నికల రిజల్ట్ ను బట్టి ఉంటుంది. సో.. చూస్తోంటే ఇంక ఈ డాక్టర్ పిల్ల సినిమా కెరీర్ ముగిసనట్టే అనేది విశ్లేషకుల మాట. బట్ ఇంకెవరైనా ఆఫర్ ఇచ్చి.. అది సాలిడ్ హిట్ సాధిస్తే మళ్లీ టర్న్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఆ ఆఫర్ ఇచ్చేవాళ్లెవరు అనేదే పెద్ద ప్రశ్న.

Updated : 26 March 2024 6:30 PM IST
Tags:    
Next Story
Share it
Top