Ntr Prashanth Neel Movie Update : ఎన్టీఆర్ ఎగ్రెసివ్ లైనప్ - ఈ దూకుడు మామూలుగా లేదు
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇంత అగ్రెసివ్ గా సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదు. చూస్తే ప్రభాస్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నా.. ప్రభాస్ బాహుబలి తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు చూశాడు. బట్ ఎన్టీఆర్ లైనప్ లు ఫ్లాప్ అనే మాటే వినిపించదు అనేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం దేవర పార్ట్ 1 చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుందని కొరటాల శివ అఫీషియల్ గానే చెప్పి ఉన్నాడు. దీని తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తాడు. ఈ మూవీ షూటింగ్ ఈ యేడాది నవంబర్ నుంచే స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ చెప్పారు.
ఏప్రిల్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమా
ఇక లేటెస్ట్ గా దక్షిణాది మొత్తం ఎదురుచూస్తోన్న అతి ముఖ్యమైన అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా 2024 ఏప్రిల్ నెల నుంచి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కాబోతోంది. ఇది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్ నుంచే వచ్చిన అఫీషియల్ అనౌన్స్ మెంట్. ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా ఉండబోతోంది. ఫస్ట్ పార్ట్ పూర్తి కాగానే మళ్లీ దేవర 2 స్టార్ట్ అవుతుంది. దేవరకు సంబంధించిన మేజర్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుందట. అందువల్ల సెకండ్ పార్ట్ కు ఎక్కువ టైమ్ పట్టకపోవచ్చు.
అన్నీ రెండు భాగాలుగానేనా..?
దేవర2 తర్వాత మళ్లీ ప్రశాంత్ నీల్ సినిమా సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ లోని స్పై యూనివర్శ్ లో ఎన్టీఆర్ సోలోగా మరో సినిమా ఉండబోతోంది. అంటే వార్2 తర్వాత వచ్చే సినిమా అన్నమాట. మొత్తంగా పార్ట్ 1 పార్ట్ 2 అంటూ చూసేవారికి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నా.. ఎన్టీఆర్ మాత్రం చాలా ఎగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇలా వరుస సినిమాలతో రాబోయే మూడేళ్ల పాటు బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అనిపించేలా ఉన్నాడు. అయితే వీటన్నిటికంటే ముందు 2024 ఏప్రిల్ 5న విడుదల కానున్న దేవర-1 బ్లాక్ బస్టర్ గా రికార్డులు తిరగరాయాలి. అప్పుడే ఈ మిగిలిన సినిమాలపై అంచనాలు స్టార్ట్ అవుతాయి.