‘ఆంధ్రావాలా’ నుంచి ‘ఆదిపురుష్’ వరకు.. ఆడియో లాంచ్లో ఆ సినిమాదే రికార్డ్
X
తెలుగు ప్రజలు సినిమాలను ఎంతలా ఆదరిస్తారో చెప్పక్కర్లేదు. కొందరు హీరోలను దేవుల్లుగా కొలిచారు. మరికొందరిని ఇంట్లో సభ్యులుగా మార్చుకున్నారు. ఇక్కడి ప్రజలకు సినిమాలపై ఉన్న ప్రేమ అలాంటిది మరి. అభిమాన హీరో ఆడియో లాంచ్ అయినా.. ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. దండుగా కదిలి వెళ్తారు. ఈవెంట్ ను హోరెత్తిస్తారు. సినిమా రిలీజ్ కాకముందే పండుగ చేసుకుంటారు. నిన్న (జూన్ 6) తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రిరిలీజ్ ఈవెంట్ లో అదే జరిగింది. తమ అభిమాన నటీ నటులను చూసేందుకు జనం తరలివచ్చారు. దాదాపు లక్షమంది ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
అయితే, దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమా ఈవెంట్ కు ఎక్కువ మంది వచ్చారో తెలుసా.. దాదాపు 20 ఏళ్ల ఆ సినిమా రికార్డ్ ను ఏ సినిమా ఇప్పటికీ తిరగ రాయలేకపోయింది. 2004లో విడుదలైనా ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఆడియో లాంచ్ కు పది లక్షల మంది ఫ్యాన్స్ తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్ కు రాష్ట్ర నలు మూలల నుంచి.. 10 రైళ్లు, వేల బస్సుల్లో జనం వచ్చారు. సుమారు 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుడివాడలో ఫ్లైట్ దిగిన ఎన్టీఆర్.. స్టేజ్ దగ్గరికి రావడానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది.
ఆ రికార్డ్ ను ఇప్పటికీ ఏ సినిమా తిరగరాయలేకపోయింది. ఆంధ్రావాలా తర్వాత ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చిన ఆడియో లాంచ్ ల్లో..
* ఖైదీ నంబర్ 150 - 5 లక్షల మంది
* బాహుబలి - 3 లక్షల మంది
* ఆదిపురుష్ - లక్ష మంది.. సినిమాలు ఉన్నాయి.