Home > సినిమా > Devara : ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఫిక్స్.. నిరాశలో ఫ్యాన్స్

Devara : ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఫిక్స్.. నిరాశలో ఫ్యాన్స్

Devara : ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఫిక్స్.. నిరాశలో ఫ్యాన్స్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల అవుతుందని తొలుత ప్రకటించారు. అయితే ఆ డేట్ మారింది. ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత అగస్ట్ 15న రిలీజ్ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే అల్లు అర్జున్ పుష్ప-2 అదే రోజు రిలీజ్ అవుతండడంతో మరో డేట్కు షిఫ్ట్ అయిందని ఊహగానాలు వినిపించాయి.

తాజాగా దేవర రిలీజ్ డేట్ పై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దేవరను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అన్ని పుకార్లకు చెక్ పడింది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయ్యింది. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాకు అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

దేవర రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 2022లో ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆయన దేవర సినిమా పైనే ఉన్నారు. ఎన్టీఆర్ను బిగ్ స్క్రీన్పై ఏప్రిల్ 5నే చూడొచ్చు అనుకున్న ఫ్యాన్స్కు.. మరో 6నెలలు వెయిట్ చేయడం కష్టంగా మారింది.

Updated : 16 Feb 2024 5:38 PM IST
Tags:    
Next Story
Share it
Top