Home > సినిమా > ఏంటీ.. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తోనా..?

ఏంటీ.. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తోనా..?

ఏంటీ.. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తోనా..?
X

ఏంట్రా ఈ మధ్య ఎన్టీఆర్ గురించిన వార్తలు బాగా వినిపిస్తున్నాయి అని చాలామంది అనుకుంటున్నారు. మరి మనోడు ఆ రేంజ్ లో న్యూస్ ఐటమ్ గా మారిపోయాడు. వరుసగా దేవర పోస్ట్ పోన్ అంటూ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇదే పెద్ద షాకింగ్ అంటే ఫ్యాన్స్ కు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు అని. నిజనానికి ఈ గుంటూరుకారం చేయాల్సింది ఎన్టీవోడే. కొద్దిలో తప్పిపోయింది. లేకపోతే ఆ ఘాటు ఎన్టీఆర్ కే తగిలి ఉండేది. ఇంత పెద్ద షాక్ తప్పించుకున్న తర్వాత కూడా మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా అనే వార్త ఎలా వచ్చింది.. అనుకుంటున్నారు కదా.. ఇదుగో ఇలా వచ్చింది..?

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా త్రివిక్రమ్ తోనే. కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేశారు కూడా. కానీ కథ నచ్చలేదు. రెండు మూడు ట్రై చేశారట. బట్ త్రివిక్రమ్ మాత్రం గుంటూరు కారం అయితేనే ఎన్టీఆర్ కు సూట్ అవుతుందని చెప్పడం.. అది అతనికి నచ్చకపోవడంతో ప్రాజెక్టే క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర 1 చేస్తున్నాడు. తర్వాత బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్2 ఉంటుంది. అటుపై ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైనప్ లో ఉంది. ఈ టైమ్ లో త్రివిక్రమ్ తో సినిమా అనే వార్తలు రావడం విశేషం కాదు.. ఆశ్చర్యం కూడా. అయితే ఈ వార్తలు క్రియేట్ అయిన విధానం చూస్తే విచిత్రంగా ఉంది. గతంలో త్రివిక్రమ్ అజ్ఞాతవాసి అనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అప్పుడూ అందరూ త్రివిక్రమ్ నే అన్నారు. గురూజీలో మేటర్ అయిపోయింది.. ఇక తప్పుకుంటే మంచిది అన్నారు. పైగా అది పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ మూవీ కూడా కావడంతో అటు ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో తిట్టారు. దీంతో హర్ట్ అయిన త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయాడు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది ఎన్టీఆర్. ఎవరూ పట్టించుకోని టైమ్ లో తను డేట్స్ ఇచ్చాడు. అలా వచ్చిందే అరవింద సమేత. బట్ ఈ మూవీ ఫ్యాన్స్ కు పూర్తిగా నచ్చలేదు. అందుకే మరో సినిమా చేయాలనుకున్నారు. కుదర్లేదు. అయితే అప్పుడు అజ్ఞాతవాసిలా ఇప్పుడు గుంటూరుకారం తో త్రివిక్రమ్ డిజాస్టర్ చూశాడు.. మళ్లీ సేమ్ సీన్. అందరూ ఇతన్నే అంటున్నారు. ఇప్పుడూ హర్ట్ అయ్యాడట. దీంతో మరోసారి ఎన్టీఆర్ అయితేనే త్రివిక్రమ్ కు హిట్ ఇవ్వగలడు.. అందుకే వీరి కాంబోలో సినిమా రాబోతోందనే ఇల్లాజికల్ లాజిక్స్ ను బయటకు తీస్తూ కొందరు రూమర్ రాయుళ్లు క్రియేట్ చేసిందే ఈ వార్త. నిజంగా ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ కు త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా అంటే అస్సలు చేయడు అనే చెబుతారు. మరి ఈ వార్త వచ్చిందంటే కారణం.. ఏ పిఆర్ వాళ్లో క్రియేట్ చేయించిన వార్త అని అర్థం కావడం లేదూ..?

Updated : 24 Jan 2024 4:11 PM IST
Tags:    
Next Story
Share it
Top