Home > క్రీడలు > IND-PAK Match: హాస్పిటల్‌లో బెడ్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్

IND-PAK Match: హాస్పిటల్‌లో బెడ్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్

IND-PAK Match: హాస్పిటల్‌లో బెడ్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్
X

స్పోర్ట్స్​లో క్రికెట్ గేమ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. కొన్ని దేశాల్లో ఈ గేమ్​ను జస్ట్ ఎంటర్​టైన్​మెంట్, సరదా కోసం చూస్తారు. కానీ భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి ఆసియా దేశాల్లో క్రికెట్​ అంటే ఓ ఎమోషన్. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కు ఓ రేంజ్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. దేశంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా స్టేడియాలు ఫ్యాన్స్​తో ఫుల్​గా నిండిపోతాయి. తమ అభిమాన క్రికెటర్ల ఆటతీరును చూసేందుకు అభిమానులు వేలాదిగా మైదానాలకు పోటెత్తుతారు. స్టేడియంలో మ్యాచ్​లను ఎంత మంది చూస్తారో అంతకు మించి అన్నట్లుగా.. రెట్టింపు సంఖ్యలో టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. టీమిండియా ఆడే ఇంటర్నేషనల్ మ్యాచ్​లతో పాటు భారత స్టార్ క్రికెటర్లు ఆడే ఇండియన్ ప్రీమియర్ లీగ్​కు వ్యూయర్​షిప్ కోట్లలో ఉంటుంది. ఇక వరల్డ్ కప్​ లాంటి టోర్నీల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.





ఈ వరల్డ్ కప్ టోర్నీలో రేపు దాయాది పాకిస్థాన్​తో టీమిండియా తలపడుతోంది. క్రికెట్​లో ఎన్నో భీకరమైన మ్యాచ్​లు ఈ రెండు జట్ల మధ్య జరిగాయి. ఈ ఇరు జట్లు గ్రౌండ్​లో తలపడితే కొదమసింహాలు కొట్లాడుకున్నట్లే ఉంటుంది. ఈ మ్యాచ్​కు ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. దీంతో ఈ మ్యాచ్​ టికెట్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. టికెట్లతో పాటు అహ్మదాబాద్​లో హోటల్ రూమ్స్​కు కూడా డిమాండ్ ఎక్కువైంది. ఎంతగా అంటే.. రూ.వేలు పలికే రూమ్ రేట్ కాస్తా రూ.లక్షల్లో పలుకుతోందట. దీంతో హోటల్ రూమ్స్ దొరకనివాళ్లు, అంత ధర పెట్టి రూమ్స్​లో ఉండలేని వాళ్లు స్థానిక ఆస్పత్రుల్లో బెడ్స్​ను బుక్ చేసుకుంటున్నారు. ఒక మ్యాచ్​ కోసం ఇలా హాస్పిటల్ బెడ్స్ బుక్ చేయడం బహుశా క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్ కావొచ్చు.





మ్యాచ్ నేపథ్యంలో హోటల్‌ గదులన్నీ ఇప్పటికే దాదాపు కిక్కిరిసిపోవడం, సాధారణ ధరలకన్నా 20 రెట్లు పెరగడంతో ఎలాగైనా మ్యాచ్‌ చూడాలన్న పట్టుదలతో ఉన్న ఫ్యాన్స్... స్థానికంగా ఉండే హాస్పిటల్స్ లో హెల్త్ చెకప్ ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్‌ చేసుకుంటున్నారు. మ్యాచ్‌ టైమ్ కి వెళ్లేలా ప్లాన్‌లు చేసుకుంటున్నారు. దీని వల్ల అటు హెల్త్ చెకప్ పూర్తవడంతో పాటు మ్యాచ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే రోగులకు తప్ప అభిమానులకు ఇవ్వడానికి కొన్ని ఆసుపత్రులు విముఖత చూపిస్తున్నాయి.







Updated : 13 Oct 2023 3:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top