Home > సినిమా > మొదటి సినిమాలో కృష్ణుడు...ఇప్పుడు శివుడయ్యాడు

మొదటి సినిమాలో కృష్ణుడు...ఇప్పుడు శివుడయ్యాడు

మొదటి సినిమాలో కృష్ణుడు...ఇప్పుడు శివుడయ్యాడు
X

ఓ మైగాడ్....ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాన్ని తెలుగులో మన వెంకటేష్, పవన్ కల్యాణ్ లతో కూడా తీశారు. ఓ మైగాడ్ కు సీక్వెల్ ఉంటుందని....తీస్తున్నారని అన్నారు. ఆ మూవీ కోసం చాలా రోజులుగా జనాలు ఎదురు చూస్తున్నారు కూడా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. ఓ మైగాడ్ 2 టీజర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. మొదట సినిమాలో కృష్ణుడుగా కనిపించిన ఖిలాడి అక్షయ్ కుమార్ రెండవదానిలో పరమశివుడు అవతారమెత్తాడు.


ఓ మైగాడ్ 2 టీజర్ అందరీ ఆకట్టుకుంటోంది. మనుషులు దేవుని ఉనికిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. అయినా దేవుడు వాళ్ళ కష్ట సమయాల్లో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఉంటాడని టీజర్ లో రివీల్ చేసారు. ఈ సినిమా లో అక్షయ్ కుమార్ శివుడి గా కనిపిస్తాడు. టీజర్ లో భక్తులను... దేవుని అనుచరులగా చూపించారు. ఆల్రెడీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న జనాలకు టీజర్ తో సినిమా పై అంచనాల ను పెంచింది.

ఈ క్రేజీ సినిమాకు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అమిత్ రాయే అందించారు. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమి ముఖ్య పాత్రల్లో నటించారు. అరుణ్ గోవిల్, గోవింద్ నామ్ దేవ్ లాంటివారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. దీని ట్రైలర్ ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదల ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు.

దైవభక్తి,నమ్మకం, విశ్వాసం లాంటి అంశాలతో ఓ మైగాడ్ 2 సినిమా తెరకెక్కినా వినోదానికీ తక్కువేమీ లేదని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఖిలాడీ మార్క్ ఫన్ కూడా కనిపిస్తోంది. మొత్తానికి మొదటి సినిమాలానే ఇది కూడా నవ్విస్తూ...ఆలోచింపజేసేదిగా ఉంటుందని అనిపిస్తోంది.



Updated : 12 July 2023 3:30 PM IST
Tags:    
Next Story
Share it
Top