Home > సినిమా > ఆదిపురుష్‌ ట్విట్టర్ రివ్యూ..ప్రభాస్ ఇరగదీశాడు

ఆదిపురుష్‌ ట్విట్టర్ రివ్యూ..ప్రభాస్ ఇరగదీశాడు

ఆదిపురుష్‌ ట్విట్టర్ రివ్యూ..ప్రభాస్ ఇరగదీశాడు
X

Adipurush Twitter Review : పాన్ వరల్డ్ స్టార్ ప్ర‌భాస్ రాముడిగా న‌టించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ డైరెక్ట్ చేసిన ఈ మైథ‌లాజిక‌ల్ మూవీని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ క్యూలు కట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభాస్ మానియా కొనసాగుతోంది. ఏ సినిమా థియేటర్ చూసినా ప్రభాస్ భారీ కటౌట్లతో , బెనిఫిషరీ షోలతో దద్దరిల్లిపోతోంది. భారతీయ చిత్ర ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒక‌టి. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ తొలిసారిగా రాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ నటించింది. సుమారు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు సినిమాను తెర‌కెక్కించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపరుష్ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? రాముడి పాత్రకు ప్రభాస్ న్యాయం చేశాడా? లేదా ట్విటర్ రివ్యూ ఏం చెబుతోంది ఇప్పుడు చూద్దాం.

ఆదిపురుష్ కథ :




భారతీయులకు రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రాముని కథ తెలుసు. చిన్నప్పటి ప్రతి ఒక్కరి మనసులో ఈ కథ నాటుకుపోయి ఉంటుంది. కాబట్టి ఆదిపురుష్ కథ కూడా అందరికీ తెలిసిందే. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను తీసుకుని అందుకు అనుగుణంగా రూపొందించిన సినిమానే ఆదిపురుష్ . తండ్రి మాట కోసం రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడం. రాముడితో పాటు లక్ష్మణుడు అరణ్యానికి వెళ్లడం. అడవిలో లంకేశ్వరుడు సీతని అపహరించడం. అనంతరం లంకలో ఉన్న జానకిని కాపాడేందుకు రాముడు వానర సైన్యం సహాయం తీసుకోవడం. చివరగా లంకేశ్వరుడిని హతమార్చి రాముడు సీతను ఎలా కాపాడాడు? అన్నదే ఆదిపురుష్ కథ. ఈ కథ మనకు తెలిసినప్పటికీ ఇందులో రాముడి పాత్రలో చాలా కాలం తరువాత ఓ స్టార్ హీరో నటించడం అనేది చెప్పుకోదక్క విషయం. యంగ్ స్టార్స్ ఎవరూ కూడా చేయని సాహసాన్ని ప్రభాస్ చేశాడు.

ప్ర‌భాస్ ఇరగదీశాడు :



ఆదిపురుష్‌ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలుస్తున్నాడు ప్రభాస్. శ్రీ రాముడిగా ప్ర‌భాస్ ఇరగదీశాడు. ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ కూడా ఇదే విషయాన్ని ట్వీట్స్ చేస్తోన్నారు. రాముడిగా ప్ర‌భాస్ నటన అత్యద్భుతంగా ఉందని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రధానంగా రాముడిగా ప్రభాస్ యాక్ష‌న్ సీన్స్‌ను ఓ లెవెల్ లో ఉంటాయని చెబుతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్‎గా ఎంజాయ్ చేస్తార‌ని చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో మిగిలిన క్యారెక్ట‌ర్స్‌కు కూడా ప్రాధాన్యత ఉండటంతో స్క్రీన్ మీద ప్రభాస్ చాలా తక్కువగా కనిపించాడన్న ఫీల్ కలుగుతుందంటున్నారు.

ఓం రౌత్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? :




నేటి తరానికి రామాయ‌ణాన్ని చూపించాలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్ , గ్రాఫిక్స్ , తారాగణంతో ఆదిపురుష్ సినిమాను రూపొందించారు దర్శకుడు ఓం రౌత్. అయితే ఈ విషయంలో దర్శకుడు పూర్తిస్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాడనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. సినిమాలోని మొదటి భాగాన్ని అద్భుతంగా స్క్రీన్‌పైన చూపించిన దర్శకుడు సెకెండ్ హాల్ లో కాస్త డల్ అయినట్లు అనిపిస్తోంది. కథ మొత్తం ఇంటర్వెల్ కి ముందే తెలపడంతో సెకండాఫ్‎లో చెప్పడానికి ఏమీ మిగలలేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. క్లైమాక్స్ ఫైట్స్ చాలా ఎక్కువగా సాగదీయడం, విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా లేకపోవడంతో సెకండాఫ్ బోరింగ్‎గా ఉందని ఫీల్ అవుతున్నారు. సినిమాలోని చాలా చోట్ల గ్రాఫిక్స్ కామిక్ సినిమాలో చూసిన గ్రాఫిక్స్ ఫీల్ కలిగిస్తుందని చెబుతున్నారు.

ఆదిపురుష్‎లో ఆ ఎపిసోడ్స్ హైలెట్ :

సీత పాత్ర‌లో నటించిన కృతిస‌న‌న్ కు మంచి మార్కులే పడ్డాయి. కృతి పాత్ర కూడా స్క్రీన్‎పైన ఎక్కువ సేపు కనిపించదని చెబుతున్నారు. సీత‌ను రావ‌ణాసురుడు ఎత్తుకెళ్లే ఎపిసోడ్‌‏తో పాటు లంకాద‌హ‌నం, ఇంట్ర‌వెల్ సీన్స్ తీయడంలో ఓం రౌత్ సక్సెస్ అయ్యారు. ఈ సీన్స్ సినిమాకు హైలైట్‎గా నిలిచాయ‌ని అంటున్నారు. పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆదిపురుష్ కు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయ‌ని , మొత్తంగా యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌తో పాటు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఆదిపురుష్ సినిమా కచ్చితంగా మెప్పిస్తోంద‌ని అభిప్రాయపడుతున్నారు.

Updated : 16 Jun 2023 3:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top