Ooruperu Bhairavakona : ఊరుపేరు భైరవకోన.. ఈ కలెక్షన్స్ నిజమా అబద్ధమా..
X
చిన్న హీరోలు విజయం సాధిస్తే పెద్ద పండగ చేసుకుంటారు. ఎందుకంటే ప్రమోషన్స్ అనీ, ఆడియన్స్ అటెన్షన్ సంపాదించడం కోసం అనీ.. రకరకాల ప్రయత్నాలు చేస్తూ తమ సినిమాలను భుజాలపై మోసుకుని మరీ జనాల్లోకి తీసుకువెళతారు. బట్ అన్నిసార్లూ వారి ప్రయత్నాలు వర్కవుట్ కావు. అయినప్పుడు మాత్రం ఆ ఆనందానికి హద్దుండదు. అలాగని చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా చూపిస్తేనే అసలు తంటా.యస్.. ఇప్పుడు ఊరు పేరు భైరవకోన వాళ్లు చేస్తున్న హడావిడీ చూస్తే మాత్రం అసలుకే డౌట్ వచ్చేలా ఉంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ మూవీ రివ్యూస్ పరంగా కూడా సూపర్ అనిపించుకోలేదు. పైగా కీలకమైన సెకండ్ హాఫ్ వీక్ అన్నారు. అయినా వీళ్లు మాత్రం వీకెండ్ కు మా సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అంటూ విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఏదో తేడా కొడుతోంది అనిపించక మానదు. మరి ఆ తేడా ఏంటో చూద్దాం.
ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ మాత్రమే కాదు. లక్ కూడా ఉండాలి. ఆ లక్ తెచ్చే హిట్స్ ఉండాలి. అప్పుడే నిలబడతారు. బట్ లక్కూ, హిట్లూ లేకపోయినా చాలాకాలంగా ఇండస్ట్రీలోనే ఎదురీదుతున్నాడు సందీప్ కిషన్. సందీప్ కు చివరి హిట్ ఎప్పుడు వచ్చిందీ అంటే సడెన్ గా చెప్పడం అతని వల్ల కూడా కాదేమో. అలా ఉంది పరిస్థితి. అప్పుడెప్పుడో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో విజయాన్ని అందుకున్నాడు. అంతే.. అప్పటి నుంచి ఈ ఊరుపేరు భైరవకోన వరకూ మరో విజయం పడలేదు. కానీ తన ఎఫర్ట్ మాత్రం తగ్గించలేదు సందీప్. ప్రతి సినిమాకూ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. బట్ కథో, కథనమో.. ఏదో ఒకటి తేడా కొడుతోంది. ఫ్లాప్స్ పడుతున్నాయి. అయితే ఈ సారి చాలా కాన్ఫిడెంట్ గా ఊరుపేరు భైరవకోనతో వచ్చాడు. సినిమాపై నమ్మకంతో రిలీజ్ కు రెండు రోజులు ముందే ప్రీమియర్స్ వేశాడు. ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ రిలీజ్ అయింది. భారీ ఓపెనింగ్స్ లేవు కానీ.. మౌత్ టాక్ ఫర్వాలేదు అనేలా ఉంది. ఇటు రివ్యూస్ కూడా అబౌ యావరేజ్ అనేశారు. ఏ ఒక్క రివ్యూ కూడా అద్భుతం అని చెప్పలేదు. అయినా అదిరిపోయే కలెక్షన్స్ అంటూ అదేపనిగా పోస్టర్స్ వేస్తన్నారు మేకర్స్. రవితేజ ఈగల్ సినిమాకు కూడా సాధ్యం కాని రేంజ్ లో వీకెండ్ కే 20 కోట్లు వచ్చేశాయి అని బాకాలు కొడుతున్నారు. వరుస డిజాస్టర్స్ లో ఉన్న ఓ హీరో సినిమాకు బిగ్గెస్ట్ హిట్ టాక్ వస్తే తప్ప ఈ ఫిగర్ సాధ్యం కాదు. బట్ వీళ్లు ఓ యావరేజ్ సినిమాకు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. నిజంగా అన్ని వసూళ్లు సాధిస్తే మాత్రం గొప్ప విషయమే. కాకపోతే ఈ మధ్య ఇలా కలెక్షన్స్ తో వస్తోన్న పోస్టర్స్ లో నిజం అనిపించుకునేవి ఒకటీ రెండు శాతం మాత్రమే ఉంటున్నాయి. అంచేత.. ఊరుపేరు భైరవకోనకు ఓ మోస్తరు వసూళ్లు వచ్చి ఉండవచ్చు.. మరీ ఈ రేంజ్ లో అనేది అబద్ధపు పోస్టరే అనేది కొందరి అంచనా. ఎవరు ఎలా అంచనా వేసుకున్నా.. ఎన్నో యేళ్ల తర్వాత సందీప్ కిషన్ మాత్రం తనకు ఓ పెద్ద హిట్ వచ్చిందన్న ఆనందంలో ఉన్నాడు. ఈ కలెక్షన్స్ నిజంగా నిజమే అయితే మాత్రం అతని ఆనందంలో నిజాయితీ ఉన్నట్టే అని చెప్పాలి.