Home > సినిమా > Attack on Amardeep : అమర్‌దీప్ ఫ్యామిలీపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి!

Attack on Amardeep : అమర్‌దీప్ ఫ్యామిలీపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి!

Attack on Amardeep  : అమర్‌దీప్ ఫ్యామిలీపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి!
X

తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్ ముగిసింది. రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు ఈ అల్లరి మూక. కొండాపూర్‌-సికింద్రాబాద్‌ వెళ్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఏం జరుగుతుందో తెలియక బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు.


బిగ్‌బాస్ షో ముగియడంతో స్టుడియో నుంచి బయటకు వస్తుండగా.. అమర్ దీప్ కారులో ఉన్నాడని తెలుసుకున్న అల్లరి మూకల గుంపు ఒక్కసారిగా అమర్ దీప్‌పై దాడి చేసింది.నానా బూతులు తిడితూ.. కారును అద్దాలను మొత్తం ధ్వంసం చేసి.. అమర్ దీప్‌ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. అమర్‌ కారు దిగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వదిలిపెట్టమని వేడుకున్నా.. ఆ ఆకతాయిలు మాత్రం దాడిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఆడవాళ్లను సైతం బండ బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ఒకడైతే ఏకంగా కారు పైకి ఎక్కేసి.. నాట్యం చేసేశాడు. ఇంకొకడైతే ఎదురుగా ఉన్న బస్సు ఎక్కి అక్కడ నుంచి కర్రలు రాళ్లు విసురుతూ భయాందోళనకు గురి చేశాడు. దీనంతటికి ఇద్ధరి అభిమానుల మధ్య జరిగిన గొడవే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. ఇరు వర్గాల అభిమానులను చెదరగొట్టి భద్రత మధ్య అమర్‌దీప్‌ను పంపించారు.





ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు.తమ అభిమాన కంటెస్టెంట్లను చూసేందుకు వాళ్లంతా పోటీ పడి రచ్చ చేశారు. పల్లవి ప్రశాంత్ విజేత అని తెలియగానే ఆనందంతో అతడి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే అక్కడే ఉన్న అమర్‌దీప్‌ ఫ్యాన్‌, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ తోపులాటకు దిగారు. అసభ్యపదజాలంతో తిట్టుకున్నారు. పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ సిటీ ఆర్టీసీ బస్సు, ఓ కారు అద్దాలను పగులకొట్టారు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికుల్ని సైతం భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఆ అల్లరి మూకలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పారు కానీ.. ఏ ఫ్యాన్స్ కూడా ఇంత చిల్లరగా అయితే బిహేవ్ చేయరు







Updated : 18 Dec 2023 8:31 AM IST
Tags:    
Next Story
Share it
Top