Home > సినిమా > తగ్గేదేలేదన్న కంటెండర్స్.. పవరాస్త్ర ఎవరి సొంతమైందంటే..?

తగ్గేదేలేదన్న కంటెండర్స్.. పవరాస్త్ర ఎవరి సొంతమైందంటే..?

తగ్గేదేలేదన్న కంటెండర్స్.. పవరాస్త్ర ఎవరి సొంతమైందంటే..?
X

బిగ్బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. నాల్గోవారం హౌస్మేట్ అయ్యేందుకు కంటెస్టెంట్లంతా శక్తి వంచన లేకుండా పోటీ పడ్డారు. రెండు వారాల ఇమ్యూనిటీతో పాటు మరికొన్ని ప్రయోజనాలు పొందేందుకు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరకు ముగ్గురు కంటెండర్లలో ఒకరైన రైతుబిడ్డ నాల్గో హౌస్మేట్గా మారాడు.

ఫోర్త్ హౌస్మేట్ కోసం జరిగిన పోటీలో భాగంగా బిగ్ బాస్ తొలుత బ్యాంక్ టాస్క్ ఇచ్చాడు. ఇప్పటికే హౌస్మేట్లు అయిన ముగ్గురిని బ్యాంకర్లుగా నియమించి తమ ఇష్ట ప్రకారం కంటెస్టెంట్లకు కాయిన్స్ ఇవ్వమని చెప్పాడు. ఆ టాస్క్ ముగిసిన తర్వాత ఏటీఎం బజర్ ఛాలెంజ్ ఇచ్చారు. ఆ టాస్క్లో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ గెలవడంతో బిగ్ బాస్ వారిద్దరిని కంటెండర్లుగా ప్రకటించారు.

ఇక థర్డ్ కంటెండర్ కోసం బిగ్ బాస్.. బీబీ గాలా పేరుతో బాస్ మరో టాస్క్ పెట్టారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా విభిన్నంగా రెడీ అయి మెప్పించాలని చెప్పాడు. ఈ టాస్క్లో శుభశ్రీ కిచెన్లో ఉపయోగించే వస్తువులతో ముస్తాబై అందరి ప్రశంసలు పొందింది. పవరాస్త్ర కోసం పోటీ పడే మూడో కంటెండర్గా నిలిచింది.

పైనల్ లెవల్లో ముగ్గురు కంటెండర్లకు బిగ్ బాస్ పట్టువదలకు డింభకా టాస్క్ ఇచ్చారు. ముగ్గురినీ పవరాస్త్రను పట్టుకోమని చెప్పి ఎవరు ఎక్కువ సేపు పట్టుకుంటే వారే హౌస్మేట్ అవుతారని ప్రకటించారు. అయితే గంటలు గడిచినా విజేత తేలకపోవడంతో ముగ్గురు కంటెండర్లు తమ ప్రత్యర్థిని కన్విన్స్ చేసుకొని పోటీ నుంచి తప్పించాలని చెప్పారు. అయినా ఏకాభిప్రాయం రాకపోవడంతో బిగ్ బాస్ ఆ ఛాలెంజ్ క్యాన్సిల్ చేశాడు. కదలకురా వదలకురా పేరుతో మరో టాస్క్ ఇచ్చాడు. అందులో ముందుగా యావర్ పవరాస్త్ర కింద పడిపోవడంతో రేసు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత శుభ శ్రీ సైతం ఔట్ కావడంతో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ రెండు వారాల ఇమ్యూనిటీతో నాల్గో హౌస్మేట్ అయ్యాడు.


Updated : 29 Sep 2023 2:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top