ప్రభాస్ ఫేస్బుక్ పేజ్ హ్యాక్.. ఆ తర్వాత..
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్బుక్ సోషల్ మీడియా ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ప్రభాస్ కు ఫేస్బుక్ లో 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. ట్విట్టర్లో 1.8, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన చేసే పోస్ట్స్ నిమిషాల్లోనే ట్రెండింగ్ గా మారుతాయి. అయితే తాజాగా ఆయన ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ ఆయన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఒక వీడియోను కూడా షేర్ చేశారు.
మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్తో ఉన్న ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఫస్ట్ కల్కి మూవీ అప్డేట్ అనుకున్నారు. అయితే అది కాదని తెలుసుకుని ప్రభాస్ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయ్యిందంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన టీం అలర్ట్ అయ్యింది. వెంటనే వీడియోను డిలిట్ చేయడంతో పాటు అకౌంట్ను పునరుద్దరించింది. కాగా ఇప్పటికే పలువురి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. ఫేస్బుక్లో ప్రభాస్ కేవలం రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
ఇక ఇటీవల రిలీజైన ప్రభాస్ కల్కి 2898 AD మూవీ గ్లింప్స్ యూట్యూబ్ను షేక్ చేసింది. కల్కి గ్లింప్స్ అదిరిందంటూ సినీ ప్రముఖులు సైతం కామెంట్స్ చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా.. వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటిస్తున్నారు. 2024లో ఈ మూవీ రిలీజ్ కానుంది.