Home > సినిమా > Salaar : డైనోసార్ వేటకు ముహూర్తం ఫిక్స్ ..

Salaar : డైనోసార్ వేటకు ముహూర్తం ఫిక్స్ ..

Salaar : డైనోసార్ వేటకు ముహూర్తం ఫిక్స్ ..
X

Thumb : నో కాంప్రమైజ్ డ్యూడ్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో డార్లింగ్ కచ్చితంగా హిట్ కొటడతాడని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు . వాస్తవానికి సెప్టెంబర్ 28నే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని సీన్లలో ప్రభాస్ డబ్బింగ్ సరిగా రాలేదనే కారణంతో సినిమా విడుదలను కాస్త వాయిదా వేశారు. సినిమా పోస్ట్‎పోన్ కావడంతో ఫ్యాన్స్ కొంచెం కంగారు పడ్డారు. కానీ పక్కా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతోనే ప్రశాంత్ నీల్ రిలీజ్‌ డేట్‎ను మార్చినట్లు తెలుస్తోంది. లెట్ అయినా ఓ మంచి హిట్‎తో ప్రభాస్ వస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటేనే ప్రేక్షకులకు గుస్‌బంమ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో గత వారం రోజులుగా సాలార్ విడుదలపై పలు రకాల వార్తలు వస్తున్నాయి. సలార్ వాయిదా పడటంతో ఈ డేట్‏కు చాలా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా సాలార్ కొత్త రిలీజ్ డేట్‎పై ఒక సరికొత్త అప్‎డేట్ వచ్చింది. ఈ దీపావళి బరిలోకి ఈ సినిమాను దింపాలి అని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. నవంబర్ 10న ఈ డైనోసార్ ని బాక్సాఫీస్ బరిలోకి దింపేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ రోజు ప్ర‌భాస్ బాక్సాఫీస్ ఊచ‌కోత మొద‌లైన‌ట్టే అని అనుకోవాల్సిందే. ఇదే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. దీనిపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టును కేజిఎఫ్ సిరీస్‎లను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరంగాదూర్ నిర్మిస్తున్నారు. రాధేశ్యామ్ , సాహో, ఆదిపురుష్ ఇలా వరుస డిజాస్టర్లను చూసిన ప్రభాస్ ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. అభిమానులు సైతం ప్రభాస్ మళ్లీ సలార్‎తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి పామ్‎లోకి రావాలని భారీ ఆశలు పెట్టుకున్నారు .



Updated : 9 Sept 2023 4:29 PM IST
Tags:    
Next Story
Share it
Top