Home > సినిమా > వృద్ధుడి అవతారంలో డార్లింగ్..మారుతి ప్లాన్ ఏంటో?

వృద్ధుడి అవతారంలో డార్లింగ్..మారుతి ప్లాన్ ఏంటో?

వృద్ధుడి అవతారంలో డార్లింగ్..మారుతి ప్లాన్ ఏంటో?
X

పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు తన లుక్స్‎తో అమ్మాయిల మనసు దోచేసిన డార్లింగ్ తాజాగా వృద్ధావతారంలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్‎లో వినోదాత్మక చిత్రాలను అందించే డైరెక్టర్ మారుతీ రూపొందించే నయా మూవీలో ప్రభాస్ సీనియర్ సిటిజన్‎గా దర్శనమివ్వబోతున్నాడట. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట్లో ఓ రేంజ్‎లో రచ్చ రచ్చ అవుతోంది.

డైరెక్టర్ మారుతికి ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్‎తో పాటు చక్కటి ఎమోషన్స్‌ను పండించే సినిమాలను అందిస్తారనే మార్క్ ఉంది. మరీ ముఖ్యంగా హీరోల క్యారెక్టర్ల విషయంలో

ఏదో ఒక బలహీనతను ఆపాదించి వినోదాత్మకమైన కథను నడిపిస్తారన్నపేరు ఉంది. ప్రస్తుతం మారుతీ ప్రభాస్‌తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. హారర్‌ కామెడీ కథతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌ పాత్ర కూడా ఎంతో వినోదాత్మకంగా సాగుతుందని సమాచారం. ప్రభాస్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా పోరాట ఘట్టాలను ప్లాన్ చేశారట మారుతి.

లేటెస్టుగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రభాస్‌ మారుతి సినిమాలో డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడని టాక్ వినిస్తోంది. ఇక ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో డార్లింగ్ వృద్ధుడిగా కనిపిస్తాడని సమాచారం. ఈ సీక్వెన్స్‌ మాత్రం ఫుల్‎లెన్త్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని టాక్ . ప్రేక్షకులును కడుపుబ్బా నవ్విస్తుందని చెబుతున్నారు. అయితే ఈ మూవీకి టైటిల్‎ను మారుతీ ఫైనల్ చేయలేదు. ‘రాజా డీలక్స్‌’ ‘రాయల్‌’ ‘అంబాసిడర్‌’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుతోందని తెలిసింది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ మూవీ దీపావళి నాటికి ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.



Updated : 13 Sep 2023 5:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top